NEET PG Results 2023: నీట్‌ పీజీ-2023 ఫలితాలు విడుదల.. కేటగిరీ వారీ కటాఫ్‌ మార్కులు ఇవే..

దేశవ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి గానూ మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీటీ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్ధులు..

NEET PG Results 2023: నీట్‌ పీజీ-2023 ఫలితాలు విడుదల.. కేటగిరీ వారీ కటాఫ్‌ మార్కులు ఇవే..
NEET PG Results 2023

Updated on: Mar 15, 2023 | 9:02 PM

దేశవ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి గానూ మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీటీ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. పరీక్ష నిర్వహించిన కేవలం 9 రోజుల వ్యవధిలో రికార్డు సమయంలో ఫలితాలను విడుదల చేయడం గమనార్హం. అతి తక్కువ రోజుల్లో నీట్‌ పీజీ ఫలితాలను ప్రకటించినందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌)ను అభినందించారు.

కాగా మార్చి 5 (ఆదివారం) దేశవ్యాప్తంగా 277 నగరాల్లో 902 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నీట్‌ పీజీ-2023 ప్రవేశ పరీక్ష కోసం 10 కేంద్రాలను (హైదరాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, సత్తుపల్లి, సూర్యాపేట, కోదాడ) ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు మొత్తం 2,08,898 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారు. నీట్‌ ఫలితాల్లో జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి మొత్తం 800ల మార్కులకు 291 (50 శాతం), జనరల్‌ పీడబ్ల్యూబీడీ కేటగిరీకి 274 (45 శాతం), ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ కేటగిరీకి 257 (40 శాతం) మార్కులను కటాఫ్‌ స్కోర్‌గా నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.