NEET Long-Term Free Coaching 2025: గురుకుల విద్యార్ధులకు నీట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి

రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో ఇంటర్ చదివి నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం లాంగ్‌టర్మ్‌ శిక్షణ తరగతులు నిర్వహిస్తుందని గుంటూరు జిల్లా సమన్వయకర్త ఎస్ శ్రీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో ఉచిత వసతి, భోజన పదుపాయంతో తరగతులు ప్రారంభించినట్లు..

NEET Long-Term Free Coaching 2025: గురుకుల విద్యార్ధులకు నీట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి
NEET Long-Term Free Coaching

Updated on: Nov 12, 2025 | 9:25 PM

అమరావతి, నవంబర్‌ 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో ఇంటర్ చదివి నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం లాంగ్‌టర్మ్‌ శిక్షణ తరగతులు నిర్వహిస్తుందని గుంటూరు జిల్లా సమన్వయకర్త ఎస్ శ్రీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో ఉచిత వసతి, భోజన పదుపాయంతో తరగతులు ప్రారంభించినట్లు తెలిపారు. గుంటూరు ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాలు, గుంటూరులోని జిల్లా సమన్వయకర్త కార్యాలయం, విజయవాడలోని అంబేడ్కర్ స్టడీసర్కిల్ కార్యాలయాలను సందర్శించాలని సూచించారు. అలాగే ఇతర వివరాలకు ఫోన్ 75632 26400 నంబరును కూడా సంప్రదించవచ్చని సూచించారు.

ఏపీ పారామెడికల్‌ బోర్డు పేరు మార్పు.. కొత్త పేరు ఇదే!

ఆంధ్రప్రదేశ్‌ పారా మెడికల్‌ బోర్డు పేరును ‘ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎల్లైడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొఫెషన్స్‌ కౌన్సిల్‌’గా మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. వైద్యారోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ పర్యవేక్షణలోని పారా మెడికల్‌ బోర్డును గతంలో రద్దుచేసి, కొత్త కౌన్సిల్‌గా పునర్‌ వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే.

ఏపీ డీఎస్సీ 1998 అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాల్సిందే.. మంత్రి లోకేశ్‌కు వినతి పత్రం అందజేత

ఏపీలో డీఎస్సీ-1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు మినిమం టైం స్కేల్‌తో ఉపాధ్యాయ ఉద్యోగాలు కేటాయించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌కు డీఎస్సీ 1998 మిగిలిన అభ్యర్థుల సమాఖ్య అధ్యక్షుడు బైరవకోన శ్రీనివాసరావు వినతిపత్రం అందజేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మంత్రిని కలిశారు. ఎన్నికలకు ముందు గత ఏడాది యువగళం పాదయాత్ర, ప్రజాదర్బార్‌లలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1998 డీఎస్సీ బ్యాచ్‌లో మొత్తం 1,814 మంది మిగిలి ఉండగా.. ఇందులో 60 ఏళ్లు నిండని వారు 1500 మందే ఉన్నారు. వారందరికీ న్యాయం చేయాలంటూ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.