NEET 2021 Latest News : నీట్ 2021 పరీక్షకు దరఖాస్తు చేసుకోడానికి విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు ఇవే..!

|

Mar 15, 2021 | 1:07 PM

నీట్ పరీక్ష కోసం ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న విద్యార్థుల ఎదురుచూపులు తెరపడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) యూజీ నీట్ 2021 పరీక్ష తేదీని ప్రకటించింది. ప్రతిష్టాత్మక వైద్య పరీక్షను రాత పరీక్ష...

NEET 2021 Latest News : నీట్ 2021 పరీక్షకు దరఖాస్తు చేసుకోడానికి విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు ఇవే..!
Neet 2021 Latest News
Follow us on

NEET 2021 Latest News :  నీట్ పరీక్ష కోసం ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న విద్యార్థుల ఎదురుచూపులు తెరపడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) యూజీ నీట్ 2021 పరీక్ష తేదీని ప్రకటించింది. ప్రతిష్టాత్మక వైద్య పరీక్షను రాత పరీక్ష గా 2021 ఆగస్టు 1 ఆదివారంన నిర్వహించనున్నారు. నీట్ 2021 పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చూడటానికి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి NTA యొక్క అధికారిక వెబ్‌సైట్‌ nta.ac.in లోకి లాగిన్ అవ్వవచ్చు.

NEET (UG) 2021 దరఖాస్తు ఫారమ్ స్వీకరించే సమయంలో .. పరీక్ష, సిలబస్, వయస్సు, అర్హత, రిజర్వేషన్లు, సీట్ల వర్గీకరణ, పరీక్ష ఫీజు, పరీక్షా నగరాలు, స్టేట్ కోడ్ లతో పాటు అన్ని ఇతర ముఖ్యమైన సమాచారాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తరువాత, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి నీట్ 2021 కి అప్లై చేయాలనుకునేవారు కొన్ని సాధారణ దశలను అనుసరించాలి. అవి ఏమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..!

మొదటి దశ : దరఖాస్తు చేసుకునే విద్యార్థి లేదా తల్లిదండ్రుల ప్రత్యేక ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్‌ను ఉపయోగించి ‘ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్’ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంది.

రెండవ దశ: ‘ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం’ నింపిన తర్వాత సిస్టమ్ ఒక అప్లికేషన్ నంబర్‌ను ఇస్తుంది. దానిని నోట్ చేసుకోవాలి

మూడవ దశ : అభ్యర్థి యొక్క తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో , పోస్ట్ కార్డ్ సైజు ఫోటో తోపాటు అభ్యర్థి సంతకం, ఎడమ చేతి బొటనవేలు ముద్ర లను స్కాన్ చేసి జత చేయాలి.. వీటి తో పాటు అభ్యర్థి యొక్క 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ ను జిరాక్స్ కాపీని జతచేయాల్సి ఉంటుంది.

నాలుగు దశ : నీట్ కు నిర్ణయించిన ఫీజును డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / నెట్-బ్యాంకింగ్ / యుపిఐ ద్వారా ఎస్బిఐ / సిండికేట్ / హెచ్ డి ఎఫ్ సీ / ఐసిఐసిఐ / పేటిఎమ్ ద్వారా చెల్లించండి. ఆ రశీదును భద్రపరచుకోండి. భవిష్యత్ ఏమైనా అవసరమైనచో ఫీ రశీదును రిఫరెన్స్ గా ఉపయోగించవచ్చు
న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఎంబిబిఎస్ చేయాలన్నా ..అన్ని ఎయిమ్స్ లో ఎంబిబిఎస్ కోర్సులో ప్రవేశం కావాలన్నా నీట్ పరీక్షరాయాల్సిందే.. అంతేకాదు అన్ని వైద్య సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి సంవత్సరం నీట్ పరీక్ష నిర్వహిస్తారు.

ఎన్‌టిఎ నోటిఫికేషన్ ప్రకారం నీట్ 2021 పరీక్ష ఈ ఏడాది ఇంగ్లీష్, హిందీతో సహా 11 భాషల్లో నిర్వహించడానికి అధికారులు రెడీ అవుతున్నారు. 2021 నీట్ పరీక్ష రాయాలని భావించే విద్యార్థులు తప్పనిసరిగా : nta.ac.in మరియు ntaneet.nic.in. వెబ్ సైట్స్ పై దృష్టి పెట్టాల్సి ఉంది.

Also Read:

Sweet Corn Bonda Recipe : రెగ్యులర్ స్నాక్స్ తో బోర్ కొట్టిందా.. స్వీట్ కార్న్ తో స్నాక్స్ కు ట్రై చేస్తే సరి

: జక్కన్న క్రియేటివిటి.. రాముడి కోసం ఎదురుచూస్తున్న సీత.. అదిరిపోయిన అలియా లుక్..