RRR Movie: జక్కన్న క్రియేటివిటి.. రాముడి కోసం ఎదురుచూస్తున్న సీత.. అదిరిపోయిన అలియా లుక్..

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. సినిమాలో టాలీవుడ్‌ అగ్ర హీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు

RRR Movie: జక్కన్న క్రియేటివిటి.. రాముడి కోసం ఎదురుచూస్తున్న సీత.. అదిరిపోయిన అలియా లుక్..
Alia Bhatt In Rrr
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 15, 2021 | 12:43 PM

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. సినిమాలో టాలీవుడ్‌ అగ్ర హీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు నటిస్తుండడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు జక్కన్న. ఆర్‌.ఆర్‌.ఆర్‌లో రామ్‌ చరణ్‌ అల్లురి సీతా రామరాజు పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. చెర్రీకి జోడిగా బాలీవుడ్‌ నటి అలియాభట్‌ నటిస్తోంది. తాజాగా చిత్ర యూనిట్‌ అలియాభట్‌ పుట్టిన రోజు సందర్భంగా అలియా ఫస్ట్ లుక్ పోస్టర్‏ను విడుదల చేశారు.

రాముడి కోసం ఎదురుచూస్తున్న సీతగా అలియా భట్ లుక్ అదిరిపోయింది. ఇందులో అలియా ఆకుపచ్చని చీరలో.. రాముడి కోసం ఎదురుచూసిన సీత అలసిపోయి అలిగి కుర్చున్నట్టుగా కనిపిస్తుంది. అలియా లుక్ అధుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో లీవుడ్ న‌టుడు అజయ్ దేవగణ్‌, ఇంటర్నేషనల్ స్టార్స్ రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ, ఒలీవియా మోరిస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సౌత్ స్టార్ సముద్రఖని, శ్రియా శరణ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‏తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Also Read:

Happy Birth Day Alia Bhatt: ‘ఆర్ఆర్ఆర్’ సీత గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. అలియా అందమైన ఫోటోలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!