NCRA Recruitment 2022: టెన్త్‌/డిగ్రీ అర్హతతో నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.60 వేలకు పైగా జీతం..

మహారాష్ట్రకు చెందిన పుణె యూనివర్సిటీ క్యాంపస్‌ పరిధిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ (NCRA Pune).. 25 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-బి, టెక్నికల్ అసిస్టెంట్..

NCRA Recruitment 2022: టెన్త్‌/డిగ్రీ అర్హతతో నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.60 వేలకు పైగా జీతం..
Ncra Pune

Updated on: Aug 22, 2022 | 7:36 AM

NCRA Pune Administrative Assistant Recruitment 2022: మహారాష్ట్రకు చెందిన పుణె యూనివర్సిటీ క్యాంపస్‌ పరిధిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ (NCRA Pune).. 25 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-బి, టెక్నికల్ అసిస్టెంట్-బి (సివిల్), టెక్నికల్ అసిస్టెంట్-బి(ఎలక్ట్రానిక్స్) తదితర (Administrative Assistant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది. పోస్టును బట్టి పదోతరగతి, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. వయసు 28 నుంచి 38 యేళ్ల మధ్య ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 31, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.26,946ల నుంచి రూ.61,818ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

  • అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-బి పోస్టులు: 3
  • టెక్నికల్ అసిస్టెంట్-బి(సివిల్) పోస్టులు: 1
  • టెక్నికల్ అసిస్టెంట్-బి(ఎలక్ట్రానిక్స్) పోస్టులు: 1
  • క్లర్క్-ఎ పోస్టులు: 1
  • ల్యాబొరేటరీ అసిస్టెంట్-బి పోస్టులు: 1
  • ట్రేడ్స్‌మ్యాన్-బి(ప్లంబర్) పోస్టులు: 1
  • ట్రేడ్స్‌మ్యాన్-బి(వెల్డర్) పోస్టులు: 1
  • ట్రేడ్స్‌మన్-బి(ఎలక్ట్రికల్) పోస్టులు: 1
  • డ్రైవర్-బి పోస్టులు: 5
  • వర్క్ అసిస్టెంట్ పోస్టులు: 6
  • సెక్యూరిటీ గార్డ్ పోస్టులు: 4

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.