ICMR-NCDIR Recruitment 2022: నెలకు రూ.72 వేల జీతంతో.. నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్‌ ఇన్‌ఫ‌ర్మాటిక్స్ అండ్ రిసెర్చ్‌లో ఉద్యోగాలు..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బెంగళూరులోని ఐసీఎంఆర్ - నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్‌ ఇన్‌ఫ‌ర్మాటిక్స్ అండ్ రిసెర్చ్.. 21 ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ తదతర పోస్టుల..

ICMR-NCDIR Recruitment 2022: నెలకు రూ.72 వేల జీతంతో.. నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్‌ ఇన్‌ఫ‌ర్మాటిక్స్ అండ్ రిసెర్చ్‌లో ఉద్యోగాలు..
ICMR-NCDIR Recruitment 2022

Updated on: Nov 15, 2022 | 6:33 AM

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బెంగళూరులోని ఐసీఎంఆర్ – నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్‌ ఇన్‌ఫ‌ర్మాటిక్స్ అండ్ రిసెర్చ్.. 21 ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, రీసెర్చ్‌ అసోసియేట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్టాటిస్టిక్స్‌, మెడికల్‌, నాన్‌ మెడికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంబీబీఎస్‌/ ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 30 నుంచి 40 యేళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా నవంబర్‌ 22, 23, 24 తేదీల్లో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావల్సి ఉంటుంది. అర్హతలను బట్టి షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచినవారికి నెలకు రూ.32,000ల నుంచి రూ.72,325ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌:

ICMR-NCDIR, Nirmal Bhawan, ICMR Complex, 2nd Floor, Poojanahalli Kannamangala Post, Bengaluru-562110.

ఇవి కూడా చదవండి

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.