NBCC Recruitment: నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్స్ కార్పొరేషన్ లిమిటిడెట్ (NBCC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ నవరత్న కంపెనీ అయిన ఈ సంస్థ పలు విభాగాల్లో ఉన్న మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్) 06, అడిషనల్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) 02, ప్రాజెక్ట్ మేనేజర్ (సివిల్) 15 ఖాళీలు ఉన్నాయి.
* జనరల్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 15 ఏళ్ల అనుభవం ఉండాలి.
* అడిషనల్ జనలర్ మేనేజర్ (మార్కెటింగ్) పోస్టులకు అప్లై చేసుకునే వారు ఎంబీఏ/పోస్ట్ గ్రాడ్యయేషన్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో 12 ఏళ్ల అనుభవం ఉండాలి.
* ప్రాజెక్ట్ మేనేజర్ (సివిల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సివిల్ ఇంజనీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో 6 ఏళ్ల అనుభవం ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మొదట పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అంనతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* మే 9న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ జూన్ 8తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..