NIN Recruitment: నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తుల గడువు రేపటితోనే ముగియనుంది..

|

Jul 04, 2021 | 11:58 AM

NIN Recruitment 2021: భార‌త ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ (నిన్‌) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. హైద‌రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థలో వివిధ విభాగాల్లో మొత్తం..

NIN Recruitment: నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తుల గడువు రేపటితోనే ముగియనుంది..
Nin Recruitment
Follow us on

NIN Recruitment 2021: భార‌త ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ (నిన్‌) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. హైద‌రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థలో వివిధ విభాగాల్లో మొత్తం 09 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. దరఖాస్తుల స్వీకరణ రేపటితో (05-07-2021) ముగియనుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హత‌లు..

* ఫిజియాలజీ, న్యూట్రిషన్‌, న్యూట్రిషనల్‌ బయోకెమిస్ట్రీ విభాగాల్లో ప్రాజెక్ట్ టీచింగ్ అసోసియేట్ (03) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.
* పైన తెలిపిన‌ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* ప్రాజెక్ట్‌ లెక్చరర్‌ (స్టాటిస్టిక్స్ – (01) పోస్టుకు ద‌రఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
* స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌, బయోకెమిస్ట్రీ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్‌ టీచింగ్‌ అసిస్టెంట్ (02) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* ప్రాజెక్ట్‌ డెటా ఎంట్రీ ఆపరేటర్ (01) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌తో పాటు సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
* ప్రాజెక్ట్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్ (01) పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు..పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల డీఎంఎల్‌టీ డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* ప్రాజెక్ట్‌ ల్యాబ్‌ అటెండెంట్ (01) పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు హైస్కూల్‌/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత‌, ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థుల‌ను ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 05.07.2021ని చివ‌రి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివ‌రాల‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: VIZAG Steel Recruitment 2021: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..అప్లై చేసుకోండిలా!

TS Police Jobs: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు ప్రారంభం.. త్వరలో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం

Corona Effect : విద్యావ్యవస్థపై కరోనా ప్రభావం..! అడ్మిషన్లు లేక మూతపడుతున్న కళాశాలలు.. పలు కోర్సుల రద్దు