NIFT Srinagar Recruitment: శ్రీన‌గ‌ర్ నిఫ్ట్‌లో గ్రూప్‌-సీ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు నేడే చివ‌రి తేదీ..

|

Jun 21, 2021 | 5:47 PM

NIFT Srinagar Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ (నిఫ్ట్‌) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా శ్రీన‌గ‌ర్ క్యాంప‌న్‌లో ఉన్న...

NIFT Srinagar Recruitment: శ్రీన‌గ‌ర్ నిఫ్ట్‌లో గ్రూప్‌-సీ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు నేడే చివ‌రి తేదీ..
Srinagar Nift
Follow us on

NIFT Srinagar Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ (నిఫ్ట్‌) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా శ్రీన‌గ‌ర్ క్యాంప‌న్‌లో ఉన్న ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. గ్రూప్‌-సి పోస్టుల‌ను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు నేటితో (21-06-2021) స‌మ‌యం ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న పోస్టులు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 18 పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నున్నారు.
* వీటిలో స్టెనో గ్రేడ్‌–3– (01), అసిస్టెంట్‌(ఫైనాన్స్‌–అకౌంట్స్‌)– (01), అసిస్టెంట్‌ వార్డెన్‌(ఫిమేల్‌)– (01), మెషీన్‌ మెకానిక్‌– (01), లైబ్రరీ అసిస్టెంట్‌– (01), జూనియర్‌ అసిస్టెంట్‌– (02), ల్యాబ్‌ అసిస్టెంట్‌– (03), డ్రైవర్‌– (01), మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌)– (07) ఖాళీలున్నాయి.

* పైన తెలిపిన ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. పోస్టుల‌ను అనుస‌రించింది టెన్త్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేష‌న్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ నేటితో (21-06-2021) ముగియ‌నుంది.

* పూర్తి వివ‌రాల కోసం www.nift.ac.in/srinagar/careers వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Also Read: CBSE Exam: ఇంట‌ర్న‌ల్ మార్కులు న‌చ్చ‌ని సీబీఎస్ఈ విద్యార్థుల‌కు పరీక్ష‌లు.. ఆగ‌స్టులో నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డి.

National Career Service Portal : ప్రైవేట్ జాబ్ కోసం వెతుకుతున్నారా..! అయితే అన్ని వివరాలు ఇక్కడ లభిస్తాయి..

CRPF: సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్ క‌మాండెంట్ ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌న్న‌రకు పైగా జీతం పొందే అవ‌కాశం..