CIPET Recruitment 2021: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమిక‌ల్స్‌లో ఉద్యోగాలు.. ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి..

CIPET Chennai Recruitment 2021: సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమిక‌ల్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ(సీపెట్‌)లో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. చెన్నైలో ఉన్న ఈ సంస్థ‌లో మొత్తం 08 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు....

CIPET Recruitment 2021: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమిక‌ల్స్‌లో ఉద్యోగాలు.. ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి..
Cipet Chennai
Follow us

|

Updated on: Jun 21, 2021 | 6:18 PM

CIPET Chennai Recruitment 2021: సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమిక‌ల్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ(సీపెట్‌)లో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. చెన్నైలో ఉన్న ఈ సంస్థ‌లో మొత్తం 08 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివరాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* మొత్తం 08 ఖాళీల‌కు గాను చీఫ్ మేనేజర్(టెక్నిక‌ల్ ల‌సోసియేట్ ప్రొఫెస‌ర్)- (5), చీఫ్ మేనేజర్ ( ప‌ర్సన‌ల్ అండ్ అడ్మినిస్ట్రేష‌న్ ,ఫైనాన్స్ & అకౌంట్స్‌) – (02), మేనేజ‌ర్ (ప‌ర్సన‌ల్ & అడ్మినిస్ట్రేష‌న్ ) – (01) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* చీఫ్ మేనేజ‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. సంబంధిత సబ్జెక్టులో ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సంబంధిత రంగంలో అనుభవంతో పాటు టెక్నిక‌ల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.

* చీఫ్ మేనేజ‌ర్ పోస్టుల‌కు అప్లై చేసుకునే వారు.. బీకాంతో పాటు ఫైనాన్స్‌లో ఎంబీఏ ఉత్తీర్ణత‌. సంబంధిత రంగంలో అనుభ‌వంతో పాటు టెక్నికల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.

* మేనేజ‌ర్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. డిగ్రీతోపాటు ఎంబీఏ/ ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌లో పీజీ/ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణ‌త‌, సంబంధిత రంగంలో అనుభ‌వంతో పాటు టెక్నికల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్ లేదా ప్రాక్టిక‌ల్ టెస్ట్‌తో పాటు ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు.. ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీగా జూలై 30ని నిర్ణ‌యించారు. * పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Monthly Pension: అద్భుతమైన పాలసీ.. ఒక్కసారి మాత్రమే కట్టండి.. నెలకు రూ. 23 వేల పెన్షన్ తీసుకోండి..

Big Breaking: తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. వివరాలు ఇవే..

ICICI Bank Customers : ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్..! ఖరీదైన వస్తువులను ఇప్పుడు సులభంగా కొనుగోలు చేయొచ్చు..