NHRC Recruitment: నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌లో ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు.. తెలుగు వారికి కూడా అవకాశం.. పూర్తి వివరాలు..

|

Mar 18, 2022 | 6:07 PM

NHRC Recruitment: నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ (NHRC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలో ఉన్న ఈ సంస్థలో ట్రాన్స్‌లేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

NHRC Recruitment: నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌లో ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు.. తెలుగు వారికి కూడా అవకాశం.. పూర్తి వివరాలు..
Nhrc Recruitment
Follow us on

NHRC Recruitment: నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ (NHRC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలో ఉన్న ఈ సంస్థలో ట్రాన్స్‌లేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 43 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో గుజరాతీ (03), కన్నడ (02), తమిళ్‌ (07), తెలుగు (05), మరాఠీ (02), బెంగాలీ (12), ఒరియా (10), ఉర్దూ/కాశ్మీరీ (01), అస్సామీస్‌ (01) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత భాషతోపాటు ఇంగ్లిష్‌పై పట్టు ఉండాలి. ట్రాన్స్‌లేషన్‌ పనిలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్, మానవ్‌ అధికార్‌ భవన్, సీ బ్లాక్, జీపీఓ కాంప్లెక్స్, న్యూఢిల్లీ–110023 అడ్రస్‌కు పంపించాలి.

* దరఖాస్తుల స్వీకరణకు 31-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Credit Card: విదేశీ ప్రయాణాలకు క్రెడిట్ కార్డు.. కార్డు ఎంపికలో ఈ విషయాలు గమనించాల్సిందే..

Holi 2022: హోలీ వేడుకల్లో రంగులతో పాటు మందు.. నోటి నోటికీ లిక్కర్ సప్లై చేసిన MLA శంకర్‌ నాయక్‌

Covid 19: ప్రసవానికి ముందు.. తర్వాత తల్లి నుంచి బిడ్డకు కోవిడ్‌ సోకే ప్రమాదం ఉందా..? అధ్యయనంలో సరికొత్త విషయాలు