National Housing Bank Recruitment 2021: నేషనల్ హౌజింగ్ బ్యాంక్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో పోస్టులు ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైన విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు.
* అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు, అలాగే డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 32 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 200 మార్కులకు గాను ఆబ్జెక్టివ్, 30 మార్కులకు డిస్క్రిప్షన్ ప్రశ్నాపత్రం ఉంటుంది.
* ఎంపికై అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 60 వేల నుంచి రూ. 1,26,954 వరకు పొందే అవకాశం ఉంది.
* దరఖాస్తుల స్వీకరణకు 30-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: LIC: ఎల్ఐసీ పాలసీతో పాన్ లింక్ చేసుకున్నారా.. లేకుంటే వెంటనే చేసుకోండి.. ఎందుకంటే..