NPCIL Recruitment 2021: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియా (ఎన్‌పీసీఐఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థ కర్ణాటకలోని కైగా సైట్‌లో ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా ఫిక్స్‌డ్ టర్మ్ ఇంజనీర్‌లను రిక్రూట్ చేసుకోనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 9 నుంచి ప్రారంభమవుతోన్న వేళ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 26 ఫిక్స్‌డ్ టర్మ్ ఇంజినీర్ పోస్టులను భర్తీచేయనున్నారు.
* 26 ఖాళీల్లో భాగంగా సివిల్ (11), మెకానికల్ (08), ఎలక్ట్రికల్ (04), సీ అండ్ ఐ-ఈసీ (02), సీ అండ్ ఐ సీఎస్/ఐఎస్ (01) ఖాళీలను రిక్రూట్ చేస్తారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో ఇంజినీరింగ్ (బీఈ/బీటెక్/బీఎస్సీ) డిగ్రీని 60 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 29-07-2021 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికై అభ్యర్థులకు నెలకు రూ. 61,400 జీతంగా అందిస్తారు.
* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 09-07-2021న ప్రారంభమవుతుండగా 29-07-2021తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral Video: పెళ్లిలో నవ వధువు కత్తి విన్యాసాలు.. అబ్బురపరిచే వీడియో.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!
Major Movie: అంచనాలు పెంచుతున్న అడివి శేష్ సినిమా.. భారీ ధరకు మేజర్ మూవీ హిందీ శాటిలైట్ రైట్స్..