Bachelor of Architecture 2021: నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (NATA) 2021 మొదటి పరీక్ష ఫలితాల తేదీ ఖారారైంది. ఈ నెల 20 న పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఫలితాలు విడుదలైన అనంతరం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nata.in లో తనిఖీ చేసుకోవచ్చు. ఎన్‌ఏటీఏ 2021 మొదటి పరీక్షను ఏప్రిల్ 10న కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విజయవంతంగా నిర్వహించింది. ఐదేళ్ల బి.ఆర్క్ కోర్సు మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఎన్‌ఏటీఏ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తారు. ఈ పరీక్ష భారతదేశంతోపాటు విదేశాల్లో మొత్తం 196 కేంద్రాలలో జరిగింది. ఎన్‌ఏటీఏ రెండో రెండవ పరీక్ష జూన్ 12న జరగాల్సి ఉంది.
కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రెగ్యులేషన్స్ 2020 ప్రకారం.. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశం పొందటానికి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వహించే.. ఆప్టిట్యూడ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. అయితే పరీక్ష స్కోరు 2021-22 అకాడెమిక్ సెషన్‌కు మాత్రమే చెల్లుబాటవుతుంది.
అయితే.. పరీక్ష ఫలితాలు ఎన్‌ఏటీఏ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. విడుదల అనంతరం అభ్యర్థులు పలు వివరాలను నమోదు చేసి మార్కులను చూసుకోవచ్చు. దీంతోపాటు వారు అర్హత సాధించారో లేదో కూడా స్పష్టమవుతుంది. ఈ మొదటి పరీక్షకు మొత్తం 15066 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 14,130 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే మొదటి పరీక్షలో ఉత్తీరణతో కాకపోయినా.. హాజరుకాలేకపోయినా రెండో పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: