NALCO Recruitment: ఐటీఐ ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

|

Sep 05, 2022 | 6:05 AM

NALCO Recruitment: నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఒడిశాలోని అంగుల్‌లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో సూపరిండెంట్‌, ఆపరేటర్‌ పోస్టులను..

NALCO Recruitment: ఐటీఐ ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
NALCO Recruitment 2022
Follow us on

NALCO Recruitment: నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఒడిశాలోని అంగుల్‌లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో సూపరిండెంట్‌, ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సూపరింటెండెంట్ (02), ఆపరేటర్ (15) పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్, ఐటీఐ, బాయిలర్ అటెండెంట్ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. వీటితో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం హార్డ్‌ కాపీలను పంపించాలి.

* అభ్యర్థులను రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అభ్యర్థులు రూ. 100 అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 21-09-2022ని నిర్ణయించారు.

* అప్లికేషన్‌ హార్డ్‌కాపీలను 28-09-2022 తేదీలోపు పంపించాలి.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..