Mumbai Port Trust Recruitment: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని ముంబయి పోర్ట్ ట్రస్ట్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఎప్పుడు, ఎలా దరఖాస్తు చేసుకోవాలిలాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* మొత్తం 11 ఖాళీలకు గాను గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (05), టెక్నీషిన్ అప్రెంటిస్ (06) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి అర్హతగా సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
* అభ్యర్థుల వయసు 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండాలి.
* మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 14 నుంచి 18ఏళ్ల మధ్య ఉండాలి.
* అభ్యర్థులను ఇంజనీరింగ్ డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు తమ దరఖాస్తులను ఏటీసీ, బందర్‌భవన్, థర్డ్ ఫ్లోర్, ఎన్.వీ.నక్వా మార్గ్, మజగాన్(ఈస్ట్), ముంబై–400010 అడ్రస్‌కు పంపిచాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల చివరి తేదీగా 27-08-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Telangana School Reopen: తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ ఆరోజు నుంచేనా..?
IIMC Admissions 2021 : IIMCలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..?