MNLU Recruitment 2022: నెలకు రూ.1,31,400ల జీతంతో నేషనల్ లా యూనివర్సిటీలో టీచింగ్‌ పోస్టులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా..

|

Sep 22, 2022 | 8:38 AM

జాతీయ న్యాయ విశ్వవిద్యాలయమైన మహారాష్ట్ర రాష్ట్రం నాగ్‌పుర్‌లోని నేషనల్ లా యూనివర్సిటీ (MNLU Mumbai)..రెగ్యులర్/ఒప్పంద ప్రాతిపదికన 11 అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ లా, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల (Teaching Faculty Posts) భర్తీకి అర్హులైన..

MNLU Recruitment 2022: నెలకు రూ.1,31,400ల జీతంతో నేషనల్ లా యూనివర్సిటీలో టీచింగ్‌ పోస్టులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా..
Mnlu Mumbai
Follow us on

MNLU Mumbai Associate Professor of Law Recruitment 2022: జాతీయ న్యాయ విశ్వవిద్యాలయమైన మహారాష్ట్ర రాష్ట్రం నాగ్‌పుర్‌లోని నేషనల్ లా యూనివర్సిటీ (MNLU Mumbai)..రెగ్యులర్/ఒప్పంద ప్రాతిపదికన 11 అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ లా, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల (Teaching Faculty Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. యూజీసీ నెట్‌, స్లెట్‌లో వ్యాలిడ్‌ స్కోర్ ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో టీచింగ్‌ అనుభవం ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 28, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1500, రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులకు రూ.1000లు అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించాలి. షార్ట్‌లిస్టింగ్/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి అసోసియేట్ ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ.1,31,400లు, రిసెర్చ్ అసోసియేట్‌ పోస్టులకు రూ.50,000లు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్: Registrar, Maharashtra National Law University, Nagpur, Waranga, PO: Dongargaon (Butibori), Nagpur – 441108.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.