Telangana Jobs: కరీంనగర్‌/వనపర్తి జిల్లాల్లోని మహిళా డిగ్రీ గురుకులాల్లో టీచర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

తెలంగాణ రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబాఫులె బీసీ సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ గురుకుల కాలేజీల్లో.. తాత్కాలిక ప్రాతిపదికన 20 గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి..

Telangana Jobs: కరీంనగర్‌/వనపర్తి జిల్లాల్లోని మహిళా డిగ్రీ గురుకులాల్లో టీచర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
MJPTBCW Residential Agricultural Degree Colleges

Updated on: Dec 05, 2022 | 5:01 PM

తెలంగాణ రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబాఫులె బీసీ సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ గురుకుల కాలేజీల్లో.. తాత్కాలిక ప్రాతిపదికన 20 గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి మహాత్మా జ్యోతిబా ఫులె తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంపికైన వారు కరీంనగర్‌, వనపర్తిలోని బీసీ సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ గురుకులాల్లో పనిచేయవల్సి ఉంటుంది. అగ్రోనమీ, జెనెటిక్స్ అండ్‌ ప్లాంట్ బ్రీడింగ్, సాయిల్ సైన్స్ అండ్‌ అగ్రికల్చర్ కెమిస్ట్రీ, ఎంటమాలజీ, ప్లాంట్ పాథాలజీ, హార్టికల్చర్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ స్పెషలైజేషన్లలో ఖాళీలున్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌ ఇంజనీరింగ్‌/అగ్రికల్చర్‌ స్టాటిస్టిక్స్‌ స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీహెచ్‌డీ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అవసరం. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు డిసెంబర్ 9, 2022వ తేదిలోపు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న దరఖాస్తులను కింది ఈమెయిల్‌ ఐడీకి పంపించవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. డిసెంబర్‌ 14, 15 తేదీల్లో కింది అడ్రస్‌లో ఇంటర్వ్యలు నిర్వహిస్తారు. ఎంపికైనవారిలో టీచింగ్‌ అసోసియేట్‌ పోస్టులకు పీహెచ్‌డీ ఉన్నవారికి నెలకు రూ.45,000లు, పీహెచ్‌డీ లేని వారికి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఈమెయిల్‌ ఐడీ..

mjpadmissioncell@gmail.com

ఇవి కూడా చదవండి

అడ్రస్‌..

6th Floor, DSS Bhavan, Masabtank, Hyderabad.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.