IT Jobs: విదేశాల్లో ఐటీ ఉద్యోగాలు అంటూ మెసేజ్‌లు వస్తున్నాయా.? టెంప్ట్ అయ్యారో అంతే సంగతులు..

|

Sep 25, 2022 | 9:24 AM

IT Jobs: విదేశాల్లో ఐటీ ఉద్యోగాలు అంటూ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయా.? సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు దర్శనమిస్తున్నాయా.? ఆఫర్‌ బాగుంది కదా అని ముందు స్టెప్‌ వేశారో ఇక అంతే సంగతులు. ఫేక్‌ జాబ్‌ రాకెట్స్‌...

IT Jobs: విదేశాల్లో ఐటీ ఉద్యోగాలు అంటూ మెసేజ్‌లు వస్తున్నాయా.? టెంప్ట్ అయ్యారో అంతే సంగతులు..
Fake Jobs
Follow us on

IT Jobs: విదేశాల్లో ఐటీ ఉద్యోగాలు అంటూ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయా.? సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు దర్శనమిస్తున్నాయా.? ఆఫర్‌ బాగుంది కదా అని ముందు స్టెప్‌ వేశారో ఇక అంతే సంగతులు. ఫేక్‌ జాబ్‌ రాకెట్స్‌ అభ్యర్థులను మోసం చేస్తూ, నిండా ముంచేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫేక్‌ జాబ్‌ రాకెట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై ఫారిన్‌లో ఉద్యోగాల ఆఫర్లు వస్తే జాగ్రత్తగా ఉండాలిని కేంద్ర విదేశాంగ శాఖ యువతను హెచ్చరించింది. తాజాగా మయన్నార్‌లో ఫేక్‌ జాబ్‌ రాకెట్‌ వలలో చిక్కుకున్న వారిని కేంద్ర విదేశాం శాక రక్షణ ఇచ్చింది.

ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ.. ‘కొంత మంది నేరస్థులు థాయ్‌లాండ్‌లో డేటా ఎంట్రీ జాబ్స్‌ పేరుతో ఇండియా, దుబాయ్‌ ఏజెంట్లు సోషల్‌మీడియాలో ప్రకటనలు ఇస్తున్నారు. డిజిటల్‌ సేల్స్‌, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఉద్యోగాల కోసం యువతను థాయ్‌లాండ్‌ రప్పించుకొని, వారిని అక్రమంగా మయన్మార్‌కు తరలిస్తున్నారు. అనంతరం వారిని కాల్‌ సెంటర్‌ స్కామ్స్‌, క్రిప్టో కరెన్సీ మోసాలకు వాడుకుంటున్నారు. ఇలా నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయి చాలామంది యువత విదేశాల్లో బందీలుగా మారుతున్నారు’ అని తెలిపారు.

ఉద్యోగాల కోసం విదేశాలకు తప్పకుండా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు. జాబ్‌ లేదా టూరిస్ట్‌ విజిట్‌ వీసాపై విదేశాలకు వెళ్లేముందు ఆయా కంపెనీల వివరాలను ఆయా దేశాల్లోని దౌత్యకార్యాలయాల నుంచి తెలుసుకోవాలని తెలిపారు. తాజాగా, మయన్మార్‌లో ఫేక్‌ జాబ్‌ రాకెట్స్‌ వలలో వందల మంది చిక్కుకొన్నారు. వారిలో 32 మందిని కేంద్ర విదేశాంగ శాఖ రక్షించింది. మిగతావారిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..