Ministry of Defence: భారత రక్షణ విభాగంలో ఉద్యోగాలు.. పది నుంచి డిగ్రీ వరకు అర్హులు. ఎలా అప్లై చేసుకోవాలంటే.

|

Jul 13, 2021 | 2:11 PM

Ministry of Defence Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత రక్షణ విభాంలో మొత్తం 458 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు...

Ministry of Defence: భారత రక్షణ విభాగంలో ఉద్యోగాలు.. పది నుంచి డిగ్రీ వరకు అర్హులు. ఎలా అప్లై చేసుకోవాలంటే.
Defence Jobs
Follow us on

Ministry of Defence Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత రక్షణ విభాంలో మొత్తం 458 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 458 పోస్టుల్లో భాగంగా ట్రేడ్స్‌మెన్ మేట్‌, జేఓఏ, మెటీరియల్‌ అసిస్టెంట్‌, ఎంటీఎస్‌, ఫైర్‌మెన్‌ పోస్టులకు భర్తీచేయనున్నారు.
* ట్రే డ్స్‌మెన్‌మేట్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకు అందిస్తారు.
* జేఓఏ పోస్టులకు అప్లై చేసుకునే వారు ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 నుంచి రూ.56,900 వరకు జీతంగా చెల్లిస్తారు.
* మెటీరియల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు గ్రాడ్యుయేషన్‌ అర్హతగా నిర్ణయించారు. వీరికి నెలకు రూ. 29,200 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.
* ఎంటీఎస్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికై వారికి నెలకు రూ. 18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.
* ఫైర్‌మెన్‌ ఉద్యోగాలకు పదో తరగతిని ఉత్తీర్ణతగా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు జీతంగా చెల్లిస్తారు.
* ఏబీఓయూ ట్రేడ్స్‌మెన్‌మేట్‌ పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణత. ఈ పోస్టులకు ఎంపికై వారికి నెలకు రూ. 18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా శారీరక పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో సెలక్ట్‌ అయిన వారికి రాత పరీక్షకు అనుమతిస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను కమాండెంట్, 41 ఫీల్డ్‌ ఆమ్యునేషన్‌ డిపో, 909741 సీవో 56 ఏపీవో అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 30-07-2021 చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకోసం www.indianarmy.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Also Read: ఆయనకు బెయిల్ ఇలా వచ్చిందో, లేదో అలా భారత విమానం అక్కడ వాలింది ! కానీ.. ఏం లాభం ?

Viral Pic: ఈ చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్‌లో యమా క్రేజ్.. గుర్తుపట్టండి చూద్దాం.!

NEET Exam 2021: నీట్ 2021 రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి..