AP Schools: ‘విద్యార్ధులకు ఇచ్చే పాఠ్యపుస్తకాల్లో రాజకీయ పార్టీల రంగులు, కంటెంట్‌ వద్దు’ మంత్రి లోకేశ్‌

|

Oct 01, 2024 | 4:41 PM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర విద్యాశాఖ సమాయత్తం అవుతోంది. అన్ని పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు ‘సాల్ట్‌’ ద్వారా శిక్షణ ఇవ్వాలని మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పాఠశాల విద్య అధికారులతో అక్టోబరు 1న నిర్వహించిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. పాఠశాల నిర్వహణ కమిటీలకు..

AP Schools: విద్యార్ధులకు ఇచ్చే పాఠ్యపుస్తకాల్లో రాజకీయ పార్టీల రంగులు, కంటెంట్‌ వద్దు మంత్రి లోకేశ్‌
Minister Lokesh
Follow us on

అమరావతి, అక్టోబర్‌ 1: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర విద్యాశాఖ సమాయత్తం అవుతోంది. అన్ని పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు ‘సాల్ట్‌’ ద్వారా శిక్షణ ఇవ్వాలని మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పాఠశాల విద్య అధికారులతో అక్టోబరు 1న నిర్వహించిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. పాఠశాల నిర్వహణ కమిటీలకు అక్టోబరు నెలాఖరులోపు శిక్షణ పూర్తి చేయాలని తెలిపారు. మౌలిక సదుపాయాలు, ఫలితాల మెరుగుదలలో వారిని భాగస్వాములను చేయాలన్నారు. కమిటీ సభ్యుల అభిప్రాయ సేకరణకు ప్రత్యేక యాప్‌ను రూపొందించి, ఎప్పటికప్పుడు అభిప్రాయాలను సమీక్షించాలన్నారు. ఇక విద్యా కానుకకు సంబంధించి బాలబాలికలకు ఒకే రకమైన ప్యాట్రన్‌ ఉండేలా చూడాలని అధికారులకు తెలిపారు. అలాగే విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్యపుస్తకాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ పార్టీల రంగులు, కంటెంట్‌ ఉండకూడదని హెచ్చరించారు. పాఠశాలల్లో సౌకర్యాల కోసం రూ. వేలకోట్లు ఖర్చు చేస్తున్నా హాజరు శాతం 70 శాతమే ఉండటానికి గల కారణాలను అన్వేషించాలని సూచించారు. అనంతరం పాఠశాలల్లో విద్యార్థులకు ఇస్తున్న బ్యాగులు, బూట్లు, నిఘంటువుల నాణ్యతపై కూడా మంత్రి లోకేష్‌ అధికారులతో చర్చించారు.

ఏపీ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల విద్యార్థులకు ఉచితంగా నీట్, జేఈఈ శిక్షణ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులకు నీట్, జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ కోర్సులు ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. నారాయణ విద్యా సంస్థల సహకారంతో ఉచితంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా పలు జూనియర్‌ కళాశాలల్లో అక్టోబరు 1 ఉదయం 9.30 గంటల నుంచి 11గంటల వరకు విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కర్నూలు, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నంలోని ప్రభుత్వ కాలేజీల్లో నిర్వహించారు. ఇంటర్‌ మొదటి ఏడాది చదివే ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా నీట్, జేఈఈ శిక్షణకు విద్యార్ధులను ఎంపిక చేస్తారు. ఉత్తమ ప్రతిభ చూపిన వారికి నీట్, జేఈఈ ఉచిత శిక్షణకు ఎంపిక చేస్తారు. ఒక్కోచోట నుంచి నీట్‌కు 20, జేఈఈకి 20 మంది చొప్పున విద్యార్ధులను ఎంపిక చేస్తారు.

మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌లో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర సిలబస్‌ను తగ్గించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. సీబీఎస్‌ఈతో పోల్చితే గణితంలో రాష్ట్ర బోర్డు సిలబస్‌ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఏ అధ్యాయాలు తొలగించాలనే దానిపై సబ్జెక్టు నిపుణులు కసరత్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.