MECON Ranchi: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! నెలకు రూ.80 వేలకుపైగా జీతంతో మెకాన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

|

Dec 13, 2022 | 8:05 AM

రాంచీలోని మెకాన్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన 161 డిప్యూటీ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన..

MECON Ranchi: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! నెలకు రూ.80 వేలకుపైగా జీతంతో మెకాన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..
MECON Ranchi
Follow us on

రాంచీలోని మెకాన్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన 161 డిప్యూటీ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పోస్టును బట్టి మెకానికల్ ఇంజనీరింగ్‌/సివిల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికాం ఇంజనీరింగ్‌/కెమికల్ ఇంజనీరింగ్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌/ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌ లేదా తత్సమాన విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఆర్క్‌, ఇంజినీరింగ్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, డిప్లొమాలో ఉత్తీర్ణత అయినట్లు సర్టిఫికెట్‌ ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 2 నుంచి 24 ఏళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 30 నుంచి 54 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 25, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్‌ ఫీజుగా జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరి అభ్యర్ధులు రూ.500లు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్ సర్వీస్‌మెన్‌ కేటగిరిలకు చెందిన వారు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.35,200ల నుంచి రూ.83,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.