కలెక్టర్ అవ్వాలనే పేదింటి విద్యార్ధుల కల నెరవేర్చేందుకు సివిల్ సర్వీసెస్‌లో ఉచిత శిక్షణకు హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (ఆర్‌సీఏ) సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ)-2024 సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఆస్తిక, అర్హత కలిగిన మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 4వ తేదీ తుది గడువు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మెరిట్ కనబరచిన అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ)-2024 పరీక్షకు ఉచిత కోచింగ్‌తో పాటు భోజన, వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు.
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మనూ ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సివిల్స్ ఉచిత శిక్షణకు ఎంపిక చేస్తుంది. ప్రవేశ పరీక్ష సెప్టెంబర్ 17, 2023న నిర్వహిస్తారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.