
నీట్ పరీక్షా ఫలితాలకు బ్రేక్ పడింది. రిజల్ట్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఇది నిజంగానే షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే..నీట్ ఫలితాలను విడుదల చేయవద్దని అధికారులను ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. ఈ మేరకు నీట్ పరీక్షా ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. మే 4న చెన్నైలోని అవడిలోని ఒక పరీక్ష కేంద్రంలో విద్యుత్ అంతరాయం కారణంగా 45 నిమిషాల పాటు పరీక్ష ఆగిపోయింది. దాంతో పరీక్ష పూర్తి చేయలేకపోయిన విద్యార్థులు పరీక్ష తిరిగి నిర్వహించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.
విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై మే 17న కోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం,NTA (జాతీయ పరీక్షా సంస్థ) స్పందించే వరకూ ఫలితాలను నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే, ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.