Layoffs: దిన దిన గండం.. ప్రతీ నలుగురిలో ముగ్గురికి ఉద్యోగం కోల్పోతామనే భయం. నివేదికలో షాకింగ్ నిజాలు..

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల తొలగింపు కొనసాగుతూనే ఉంది. బడా కంపెనీలు నిర్ధాక్షణ్యంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పదేళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులను కూడా తొలగిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆర్థికమాంద్యం మేఘాలు..

Layoffs: దిన దిన గండం.. ప్రతీ నలుగురిలో ముగ్గురికి ఉద్యోగం కోల్పోతామనే భయం. నివేదికలో షాకింగ్ నిజాలు..
Layoffs Fear
Follow us

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jan 27, 2023 | 4:17 PM

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల తొలగింపు కొనసాగుతూనే ఉంది. బడా కంపెనీలు నిర్ధాక్షణ్యంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పదేళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులను కూడా తొలగిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆర్థికమాంద్యం మేఘాలు కమ్ముకోవడం, ఆర్థిక మందగమనం, ఆదాయాలు తగ్గడం కారణమం ఏదైనా కంపెనీలు కాస్ట్ కంట్రోలింగ్ మంత్రాన్ని జపిస్తున్నాయి. ట్విట్టర్‌తో మొదలైన ఉద్యోగుల తొలగింపు ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా, అమెజాన్‌, గూగుల్‌ వరకు కొనసాగింది. పెద్ద కంపెనీలే ఉద్యోగులను భరించలేని పరిస్థితిలో ఉంటే ఇక చిన్న చిన్న సంస్థలు, స్టార్టప్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. రాత్రికి రాత్రి పింక్‌ స్లిప్‌లతో ఉద్యోగులను భయపెడుతున్నాయి కంపెనీలు.

ఇదిలా ఉంటే టెక్ దిగ్గజాలు మెటా, అమెజాన్, గూగుల్, IBM, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఆర్థిక పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెరుగుతోన్న ద్రవ్యోల్బణం గురించి ప్రతీ నలుగురిలో ముగ్గురు ఆందోళన చెందుతున్నారని ఓ నివేదికలో తేలింది. ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఆలోచనలు చేస్తున్నారు. ఇక ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇటు ఉద్యోగుల్లోనూ భయాన్ని పెంచుతోంది. ప్రతీ 4 గురు ఉద్యోగుల్లో ముగ్గురు తాము ఉద్యోగాలను కోల్పోతామెమోననే భయంలో ఉన్నట్లు నివేదికలో తేలింది. వీరిలో 36 నుంచి 55 ఏళ్ల వయసున్న వారు 30 శాతంగా ఉండడం గమనార్హం.

ఇక ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో తాజాగా మరో కంపెనీ వచ్చి చేరింది. అమెరికాకు చెందిన రసాయనాల తయారీ సంస్థ డౌ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న కంపెనీ మొత్తం ఉద్యోగులలో ఈ సంఖ్య 5 శాతంగా ఉంది. ఓ నివేదిక ప్రకారం, కంపెనీ ఈ సంవత్సరం $1 బిలియన్ల ఖర్చులను తగ్గించుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఇందులో భాగమే ఉద్యోగుల తొలగింపు అని సమాచారం. ఇక మరో ఐటీ దిగ్గజం SAP కూడా ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ సంస్థ రానున్న రోజుల్లో తమ ఉద్యోగుల్లో 2.5 శాతం మందిని తొలగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,20,000 మంది ఉద్యోగులు ఉండగా సుమారు 3000 మందిని తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..