
హైదరాబాద్, జనవరి 8: దేశ వ్యాప్తంగా ఉన్నకేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS) నోటిఫికేషన్ 2025 జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 15,762 టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ముగియగా.. రాత పరీక్ష అడ్మిట్ కార్డులను తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విడుదల చేసింది. ఈ మేరకు హాల్‌టికెట్స్‌ను సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక రాత పరీక్షకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జనవరి 10, 11వ తేదీల్లో టైర్ 1 పరీక్షలు నిర్వహించనున్నారు. టైర్1లో అర్హత సాధించిన వారిని టైర్2కి అనుమతిస్తారు. అనంతరం టైపింగ్, స్టెనోగ్రఫీ, ట్రాన్స్‌లేషన్ వంటి పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. మిగతా పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
కేవీఎస్, ఎన్‌వీఎస్ 2025 అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా దేశవ్యాప్తంగా మొత్తం 1288 కేంద్రీయ విద్యాలయాలు, మొత్తం 653 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులు దేశంలో ఎక్కడైనా, గ్రామీణ, పట్టణ, రెసిడెన్షియల్ క్యాంపస్‌లలో విధుల్లో చేరవల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కింద అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTs), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGTs), ప్రైమరీ టీచర్ PRT, స్పెషల్ ఎడ్యుకేటర్ (పీఆర్‌టీ), లైబ్రేరియన్, KVS బోధనేతర పోస్టులు, NVS బోధనేతర పోస్టులను భర్తీ చేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.