KVS Exams: కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగ నియామక పరీక్ష తేదీల్లో మార్పు.. కొత్త షెడ్యూల్‌ ఇదే!

|

Feb 10, 2023 | 3:06 PM

దేశ వ్యాప్తంగా పలు కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తోన్న పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి..

KVS Exams: కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగ నియామక పరీక్ష తేదీల్లో మార్పు.. కొత్త షెడ్యూల్‌ ఇదే!
KVS revised Exam Dates 2023
Follow us on

దేశ వ్యాప్తంగా పలు కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంగతన్‌ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ పోస్టులకు ఫిబ్రవరి 7నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్‌ రాత పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నట్లు కేవీఎస్‌ తాజాగా ప్రకటన విడుదల చేసింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పరీక్ష తేదీలను సవరించినట్టు తన ప్రకటనలో తెల్పింది.

సవరించిన తేదీలు, షిఫ్టుల వివరాలను తెల్పుతూ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు అసిస్టెంట్‌ కమిషనర్‌ పేపర్‌ 1; పేపర్‌ 2లతో పాటు ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌, పీఆర్‌టీ మ్యూజిక్‌ పోస్టులకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయి. మిగిలిన పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను కేవీ సంఘటన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.