10th Public Exams 2025: పరీక్ష హాల్‌లో టెన్త్‌ విద్యార్ధి వింత ప్రవర్తన..! అనుమానం వచ్చి బ్యాగ్‌ చెక్‌ చేయగా..

|

Mar 27, 2025 | 10:32 AM

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరగుతున్న క్రమంలో ఓ పరీక్ష కేంద్రంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ర్యాంకులు కొట్టేందుకు పోటాపోటీగా విద్యార్ధులు పరీక్షలు రాస్తుంటే.. ఓ పదో తరగతి విద్యార్థి మాత్రం ఫుల్లుగా మద్యం సేవించి మద్యం మత్తులో పబ్లిక్‌ పరీక్షలు రాసేందుకు పాఠశాలకు వెళ్లాడు. ఆ తర్వాత..

10th Public Exams 2025: పరీక్ష హాల్‌లో టెన్త్‌ విద్యార్ధి వింత ప్రవర్తన..! అనుమానం వచ్చి బ్యాగ్‌ చెక్‌ చేయగా..
Student Arrives Drunk for SSLC Exams
Follow us on

కోజెంచెరి (పతనంతిట్ట), మార్చి 27: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు చదువులు, పరీక్షలతో బిజీగా ఉన్నారు. ర్యాంకులు కొట్టేందుకు పోటాపోటీగా విద్యార్ధులు పరీక్షలు రాస్తుంటే.. ఓ పదో తరగతి విద్యార్థి మాత్రం ఫుల్లుగా మద్యం సేవించి మద్యం మత్తులో పబ్లిక్‌ పరీక్షలు రాసేందుకు పాఠశాలకు వెళ్లాడు. పరీక్షా హాలులో కూర్చున్న విద్యార్ధి వాలకాన్ని చూసి ఇన్విజిలేషన్ చేస్తున్న టీచర్‌కు అనుమానం వచ్చింది. తీరా చూస్తే మద్యం కొట్టి వచ్చినట్లు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేసింది. వారు విద్యార్ధి బ్యాగును తనిఖీ చేసి పరేషాన్ అయ్యారు. ఈ షాకింగ్‌ ఘటన కేరళలోని కోజెంచెరి నగరంలోని ఓ టెన్త్‌ పరీక్ష కేంద్రంలో చోటుచేసుకుంది.

కేరళలోని కోజెంచెరి నగరంలోని ఓ టెన్త్‌ పరీక్ష కేంద్రంలో SSLC పరీక్షలు జరుగుతున్నాయి. అందరు విద్యార్ధులు తమ పరీక్ష గదుల్లో కూర్చున్నారు. ఇన్విజిలేటర్లు వచ్చి పరీక్షలు ప్రారంభించారు కూడా. అయితే పరీక్ష రాస్తున్న ఓ విద్యార్ధిని చూసిన ఇన్విజిలేషన్‌ చేస్తున్న టీచర్‌కు ఎందుకో అనుమానం వచ్చింది. దగ్గరికి వెళ్లగా మద్యం వాసన ముక్కుపుటాలను అదరగొట్టింది. అనుమానం వచ్చి విద్యార్ధి బ్యాగ్‌ చెక్‌ చేయగా అందులో మద్యం బాటిళ్లతోపాటు రూ.10 వేల నగదు కూడా ఉండటం చూసి షాక్‌ అయింది.

పరీక్ష కేంద్రంలో విధుల్లో ఉన్న పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు విద్యార్ధి వద్ద ఉన్న నగదు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో విద్యార్ధి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, విద్యార్ధిని ఎగ్జాం హాల్‌ నుంచి బయటకు పంపించేశారు. దీంతో విద్యార్ధి పరీక్ష రాయలేదు. స్కూల్‌కి చేరుకున్న సదరు విద్యార్ధి తల్లిదండ్రులను పాఠశాల యాజమన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లలపై వారి పర్యావేక్షణ ఇదేనా? అంటూ ప్రశ్నించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.