Jobs in Tourism: టూరిజంలో కోట్లాది ఉద్యోగాలు.. నిరుద్యోగులూ బీ రెడీ..

|

May 13, 2023 | 6:40 PM

ఐటీ ఉద్యోగాల్లో కోతలు.. ఆర్ధిక మాంద్యం.. కొత్త ఉద్యోగాలకు అవాకాశం లేని పరిస్థితులు.. ఇలాంటి వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తున్న వేళ నిరుద్యోగులకు ఆశాకిరణం లాంటి వార్త ఒకటి ఉంది. ఈ ఏడాది దేశ పర్యాటక పరిశ్రమలో 8.8 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు..

Jobs in Tourism: టూరిజంలో కోట్లాది ఉద్యోగాలు.. నిరుద్యోగులూ బీ రెడీ..
Jobs In Tourism
Follow us on

ఐటీ ఉద్యోగాల్లో కోతలు.. ఆర్ధిక మాంద్యం.. కొత్త ఉద్యోగాలకు అవాకాశం లేని పరిస్థితులు.. ఇలాంటి వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తున్న వేళ నిరుద్యోగులకు ఆశాకిరణం లాంటి వార్త ఒకటి ఉంది. ఈ ఏడాది దేశ పర్యాటక పరిశ్రమలో 8.8 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ పరిశ్రమ స్థూల దేశీయోత్పత్తి (GDP)కి రూ. 11.48 లక్షల కోట్లు (5%) అందించనుంది. మొత్తం ఉద్యోగాల్లో ఈ రంగం వాటా 13%. అడ్వెంచర్ టూరిజం సెగ్మెంట్ వచ్చే దశాబ్దంలో మెడికల్, వెల్నెస్, ఆధ్యాత్మికం, బిజినెస్ ట్రావెల్‌తో భారతదేశంలో అభివృద్ధి చెందుతుంది. డిజిటల్ చెల్లింపు సంస్థ వీసా , ప్రొఫెషనల్ ఎంప్లాయిమెంట్ సంస్థ EY నివేదికలో ఈ విషయం తెలిపింది.

26 రెట్లు అధికంగా ఖర్చు చేస్తున్న ఫారిన్ టూరిస్టులు..

‘చార్టింగ్ ది కోర్స్ ఫర్ ఇండియా: టూరిజం మెగాట్రెండ్స్ అన్‌ప్యాక్డ్’ పేరుతో విడుదల చేసిన రిపోర్ట్ లో దేశీయ పర్యాటకుల కంటే భారత్‌లో విదేశీ పర్యాటకులు 26 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని పేర్కొంది ఆ సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ పరిశ్రమ 2023లో కోవిడ్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకుంటుందని కూడా రిపోర్ట్ లో చెప్పారు. ఈ సంవత్సరం ఇది కోవిడ్‌కు ముందు ఉన్న స్థాయిలో 85-95%కి చేరుకుంటుంది. దీని వల్ల భారత్‌కు కూడా పెద్ద ప్రయోజనం ఉంటుంది.

అయితే విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చేస్తున్న వ్యయం వేగంగా తగ్గుతోంది. 2021-22 ఆర్ధికసంవత్సరంలో 524 కోట్ల రూపాయలు ఇందుకోసం ఖర్చు చేశారు. అది 2022-23లో 341 కోట్ల రూపాయాలుగా ఉంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 కోసం 167 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. అయితే, ఇదే సమయంలో పుణ్యక్షేత్రాల అభివృద్ధిపై వ్యయం 67% పెరిగింది. ఇదిలా ఉంటే, 2023-24 సంవత్సరానికి సాధారణ బడ్జెట్ లో పర్యాటక రంగానికి 2,400 కోట్ల రూపాయలను కేటాయించారు.

ఇవి కూడా చదవండి

2023 బడ్జెట్‌లో, కేంద్రం విదేశాల్లో ప్రచార కార్యక్రమాలపై 50% వ్యయాన్ని తగ్గించింది. స్వదేశ్ దర్శన్ పథకానికి ఈ ఏడాది టూరిజం బడ్జెట్ కంటే 50% ఎక్కువ కేటాయించారు. 2023 బడ్జెట్‌లో ఎలాంటి మార్పు లేకుండా టూరిజం కోసం రూ.2,400 కోట్లు ఉంచారు. పర్యాటక మంత్రిత్వ శాఖ లండన్, టోక్యో, బీజింగ్, దుబాయ్, సింగపూర్, న్యూయార్క్ వంటి 7 పెద్ద నగరాల్లోని పర్యాటక కార్యాలయాలను మూసివేసింది. ఈ ప్రదేశాల్లోని రాయబార కార్యాలయాల్లోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఉద్యోగుల ద్వారా మంత్రిత్వ శాఖ ఈ పనిని పూర్తి చేస్తుంది. అయినప్పటికీ, 2030 నాటికి 25 మిలియన్ల మంది పర్యాటకులను దేశానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో రాబోయే రోజుల్లో పర్యాటక రంగంలో ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్నికెరీర్ & ఉద్యోగాలు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి