Indian Army Recruitment: బీటెక్‌ పూర్తి చేసిన వారికి ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నరకుపైగా జీతం..

|

Dec 28, 2021 | 6:57 AM

Indian Army Recruitment: ఇంజనీరింగ్ పూర్తి చేససిన వారికోసం ఇండియన్‌ ఆర్మీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇండియన్‌ ఆర్మీ 135 టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ) నోటిఫికేషన్‌ను విడుదల..

Indian Army Recruitment: బీటెక్‌ పూర్తి చేసిన వారికి ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నరకుపైగా జీతం..
Follow us on

Indian Army Recruitment: ఇంజనీరింగ్ పూర్తి చేససిన వారికోసం ఇండియన్‌ ఆర్మీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇండియన్‌ ఆర్మీ 135 టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ) నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 40 ఆఫీసర్స్‌ స్థాయి పోస్టులను పర్మనెంట్‌ కమిషన్‌ కింద భర్తీ భర్తీ చేయనున్నారు.

* వీటిలో సివిల్‌/బిల్డింగ్‌ కన్సస్ట్రక్షన్‌ టెక్నాలజీ–09, ఆర్కిటెక్చర్‌–01, మెకానికల్‌–05, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెక్నాలజీ–03, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ టెక్నాలజీ/ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌–08, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–03, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్స్‌–01, టెలీకమ్యూనికేషన్స్‌–01, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌–02, ఏరోనాటికల్‌/ఏరోస్పేస్‌/ఏవియానిక్స్‌–01, ఎలక్ట్రానిక్స్‌–01, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇనుస్ట్రుమెంటేషన్‌/ఇనుస్ట్రుమెంటేషన్‌–01, ప్రొడక్షన్‌–01, ఇండస్ట్రియల్‌/ మాన్యు ఫ్యాక్చరింగ్‌–01, ఆప్టో ఎలక్ట్రానిక్స్‌–01, ఆటో మొబైల్‌ ఇంజనీరింగ్‌–01 పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

* అభ్యర్థులు జూలై 01, 2022 నాటికి అన్ని సెమిస్టర్లు/సంవత్సరాల మార్కుషీట్‌లతోపాటు ఇంజనీరింగ్‌ డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే శిక్షణ ప్రారంభించిన తేదీ నుంచి 12 వారాలలోపు ఇంజనీరింగ్‌ డిగ్రీ సర్టిఫికేట్‌ సమర్పించాలి.

* అభ్యర్థుల వయసు జూలై 01, 2021 నాటికి 20–27 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. జూలై 02,1995 నుంచి జూలై 01, 2002 మధ్య జన్మించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ముందుగా బీటెక్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం అభ్యర్థులను అలహాబాద్‌ (ఉత్తరప్రదేశ్‌), భోపాల్‌(మధ్యప్రదేశ్‌), బెంగళూర్‌ (కర్ణాటక), కపుర్తాలా(పంజాబ్‌)లలో ఎస్‌ఎస్‌బీ.. సైకలాజికల్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్‌ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి వైద్యపరీక్షలను నిర్వహించి.. తుది ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి ఇండియన్‌ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్‌లో శిక్షణ ఇస్తారు. 49 వారాల పాటు శిక్షణ ఉంటుంది.

* శిక్షణ సమయంలో రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. అనంతరం ప్రారంభవేతనం నెలకు వేతనం నెలకు రూ.56,100– రూ.1,77,000

* దరఖాస్తుల స్వీకరణకు 04-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Also Read: ID Cards: పెళ్లి తర్వాత అమ్మాయిలు ఏ పత్రాలను మార్చుకోవాలి? ఎందుకు మార్చుకోవాలి? ఇక్కడ తెలుసుకోండి..

Harassment: రెచ్చిపోయిన కీచకులు.. 15 ఏళ్ల బాలికను వేరు వేరు ప్రాంతాలు తిప్పుతూ..

Joint Pain Relief Tips: కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా? ఈ హోమ్ రెమెడీస్ ప్రయత్నించి ఉపశమనం పొందండి..