జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యాసంవత్సరానికిగానూ 9వ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో (అక్టోబర్ 25) ముగుస్తుంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ లో ఆన్‌లైన్‌లో అక్టోబర్ 25వ తేదీ ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలలో 2022-23 అకడమిక్ సెషన్‌లో 8వ తరగతి చదువుతూ ఉండాలి. అలాగే విద్యార్ధుల వయసు ఎంపిక పరీక్ష నిర్వహించబడే అడ్మిషన్ సంవత్సరం మే 1 నాటికి 13 నుంచి 16 ఏళ్ల మధ్య ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్ధులతో సహా అన్ని వర్గాల వారికి ఈ అర్హతలుండాంలి.
జవహర్ నవోదయ 9వ తరగతి సెలక్షన్ టెస్ట్ రెండున్నర గంటల సమయంలో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 100 మార్కులకు జరుగుతుంది. విభాగాలు ఇంగ్లీష్, హిందీ, మ్యథమెటిక్స్, సైన్స్ ఈ నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నాపత్నం ఇంగ్లీష్/హిందీ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. సెలక్షన్ టెస్ట్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్ధులకు ఆయా రాష్ట్రాల్లోని నవోదయ విద్యాలయాల్లో లాటరల్ ఎంట్రీ విద్యార్థులుగా ప్రవేశం కల్పిస్తారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.