JNV Admission 2022: ఏప్రిల్‌ 30న నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష.. అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకున్నారా..!

| Edited By: Anil kumar poka

Apr 24, 2022 | 8:10 AM

JNV Admission 2022: జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రవేశ పరీక్ష 30 ఏప్రిల్ 2022న నిర్వహిస్తారు.

JNV Admission 2022: ఏప్రిల్‌ 30న నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష.. అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకున్నారా..!
Jnv Admission 2022
Follow us on

JNV Admission 2022: జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రవేశ పరీక్ష 30 ఏప్రిల్ 2022న నిర్వహిస్తారు. నవోదయ విద్యాలయ సమితి ( JNV) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఇప్పటికే అడ్మిట్ కార్డ్ జారీ చేసింది. అభ్యర్థులందరూ navodaya.gov.in ని సందర్శించడం ద్వారా అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది రెండు గంటల పరీక్ష. కేవలం ఒక షిఫ్ట్‌లో నిర్వహిస్తారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రంలో మానసిక సామర్థ్యం, అంకగణిత పరీక్ష, భాషా పరీక్ష మూడు విభాగాలు ఉంటాయి. మొత్తం 100 మార్కుల పరీక్ష ఉంటుంది. దీనికి 80 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి.

అడ్మిట్ కార్డ్ లేకుండా మీరు పరీక్ష రాయడానికి అనర్హులు. ఇందుకోసం నవోదయ విద్యాలయ వెబ్‌సైట్‌ని సందర్శించండి. హోమ్ పేజీలో మీరు JNVST క్లాస్ 6 అడ్మిట్ కార్డ్ 2022ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్‌ను చూస్తారు. దానిపై క్లిక్ చేయండి. నవోదయ విద్యాలయ సమితి పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి. NVS క్లాస్ 6 అడ్మిట్ కార్డ్ 2022 పేజీ ఓపెన్‌ అవుతుంది. మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి. స్క్రీన్‌పై కనిపించే సెక్యూరిటీ కోడ్‌కు సమాధానాన్ని నమోదు చేసి సైన్-ఇన్‌పై క్లిక్ చేయండి. వెంటనే NVS అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకొని భద్రంగా ఉంచుకోండి.

మరిన్ని కెరీర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

World Book Day: నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం.. ఒక పుస్తకం చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..?

Blood Donations: రెగ్యూలర్‌గా రక్తదానం చేస్తే మంచిదే.. ఈ విషయాలు తెలిస్తే మీరూ నిజమే అంటారు..!

Back Pain: వెన్నునొప్పితో బాధపడుతున్నారా.. ఈ 6 ఇంటి చిట్కాలు పాటిస్తే బెటర్..