JEE Mains session 4 exam postponed: జేఈఈ పరీక్షలు మరోసారి వాయిదాపడ్డాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. జేఈఈ (మెయిన్) నాలుగో విడత పరీక్షల తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొంది, ఈ పరీక్షలను ఆగస్టు 26, 27, 31, అలాగే సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. కాగా, ఇందుకు అనుగుణంగా జేఈఈ మెయిన్ నాలుగో సెషన్ దరఖాస్తుల గడువును కూడా ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు.
ఇదిలావుంటే, ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా ఇప్పటికే 7.32 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని, విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేసినట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మూడు, నాలుగు విడతల జేఈఈ మెయిన్ పరీక్షల మధ్య నాలుగు వారాల వ్యవధి ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డీజీకి సూచించినట్టు మంత్రి తెలిపారు.
గత ఏప్రిల్‌లో జరగాల్సిన జేఈఈ (మెయిన్) మూడో విడత పరీక్షల్లో ఎన్‌టీఏ స్వల్ప మార్పులు చేసినట్టు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 27 నుంచి ఆగస్టు 2 వరకు మూడో విడత పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అయితే, మే నెలలో జరగాల్సిన నాలుగో దశ పరీక్షలను ఆగస్టు నెలాఖరు నుంచి నిర్వహించాలని తాజాగా నిర్ణయించింది.
Accordingly, the JEE(Main) 2021 session 4 will now be held on 26th, 27th & 31st August, and on 1st and 2nd September, 2021. A total of 7.32 lakh candidates have already registered for JEE(Main) 2021 session 4.
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 15, 2021
Read Also… Breaking: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి తేదీ ఖరారు..