JEE Main 2025 Preparation Tips: జేఈఈ మెయిన్‌ టాప్ ర్యాంకర్ సక్సెస్‌ మంత్ర.. ఇలా చదివితే టాప్ ర్యాంక్ పక్కా!

దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షల్లో జేఈఈ మెయిన్‌ ఒకటి. ఏటా రెండు సార్లు నిర్వహించే ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులు హాజరవుతుంటారు. అయితే ఈ పరీక్షలో నెగ్గేందుకు అధిర మంది తల్లిదండ్రులు తమకు తెలియకుండానే తమ పిల్లలపై అధిక ఒత్తిడి తెస్తుంటారు. రకరకాల రిఫరెన్స్ బుక్స్‌, స్టడీ మెటీరియల్స్‌, కోచింగ్ క్లాసుల పేరిట ఊపిరాడకుండా ప్రిపరేషన్‌ సాగించేలా కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటారు. తమ కోరిక మేరకు తమ పిల్లలు ర్యాంకు కొట్టాలని ఈ విధంగా అధిక భారం మోపుతుంటారు. దీంతో విద్యార్థులలో ఒత్తిడి, ఆందోళన, అలసటకు దారితీస్తుంది..

JEE Main 2025 Preparation Tips: జేఈఈ మెయిన్‌ టాప్ ర్యాంకర్ సక్సెస్‌ మంత్ర.. ఇలా చదివితే టాప్ ర్యాంక్ పక్కా!
JEE Main 2025 Preparation Tips

Updated on: Feb 24, 2025 | 7:51 AM

ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్‌ 2025 తొలి విడత పరీక్ష ఫలితాల్లో 100 శాతం పర్సంటైల్‌ సాధించిన టాప్‌ ర్యాంకర్ సాక్షమ్‌ జిందాల్.. పరీక్షల్లో రాణించడానికి అద్భుతమైన మెళకువలు చెబుతున్నాడు. అవేంటంటే.. ‘నా ప్రిపరేషన్‌లో NCERT సిలబస్‌పై పూర్తి దృష్టి సారించి కెమిస్ట్రీకి సిద్ధమయ్యాను. JEE మెయిన్‌లో, NCERT సిలబస్ తప్ప మరే రిఫరెన్స్ పుస్తకం లేదా మెటీరియల్ అవసరం లేదు. చదివిన అంశాల నుంచి మళ్ళీ మళ్ళీ ప్రాక్టికల్ ప్రశ్నలు వేసేవాడిని. ఈ విధానం నా కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ను బలపరిచింది’ అని సాక్షమ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

దేశంలో JEE మెయిన్ వంటి పోటీ పరీక్షలను ప్రతిష్టాత్మక సంస్థలు, బ్రైట్‌ కెరీర్‌లకు ప్రవేశ ద్వారాలుగా చూస్తారు. తల్లిదండ్రులు ఎక్కువ పుస్తకాలు, అధిక మెటీరియల్‌ ఉంటే మెరుగైన ప్రిపరేషన్‌ సాగించవచ్చని నమ్ముతారు. కానీ వాస్తవానికి ఇది గందరగోళాన్ని సృష్టిస్తుంటారు. ప్రభావవంతమైన అభ్యాసానికి ఈ విధానం ఆటంకం కలిగిస్తుంది. విద్యార్ధుల్లో సంభావిత స్పష్టత, సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టడానికి బదులుగా, అనేక పుస్తకాలు చదవడం వల్ల గందరగోళానికి గురవుతారు. దీంతో ఇది తరచుగా అలసటకు దారితీస్తుంది. పైగాపరీక్షల్లో రాణించాలనే ఒత్తిడి వారి మానసిక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా ప్రేరణ, ఆసక్తిని తగ్గిస్తుంది. ప్రిపరేషర్‌ సక్రమంగా సాగాలంటే సమతుల్య విధానం అవసరం. నాణ్యతకు పరిమాణం కంటే ప్రాధాన్యత అవసరం. తల్లిదండ్రులు తమ పిల్లలను స్టడీ మెటీరియల్‌తో ఓవర్‌లోడ్ చేయకుండా నిర్మాణాత్మక అధ్యయన ప్రణాళికలు, విరామాలు, భావోద్వేగ మద్దతును ప్రోత్సహించాలని సాక్షమ్‌ సూచిస్తున్నాడు.

కాగా JEE మెయిన్ టాపర్‌ జిందాల్‌.. సీబీఎస్సీ10వ తరగతి పరీక్షలలో కూడా 97.8% స్కోర్ చేయడంతో పాటు వివిధ ఒలింపియాడ్ పరీక్షలలో పలు పతకాలు సాధించాడు. జిందాల్‌ తల్లిదండ్రులు కూడా మంచి విద్యావంతులు. అతని తండ్రి డాక్టర్ ఉమేష్ జిందాల్ పాథాలజిస్ట్, తల్లి డాక్టర్ అనితా జిందాల్ డాక్టర్‌. ఇక జేఈఈ మెయిన్ దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలలో ఒకటి. గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాల నుంచి ఇందులో ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ర్యాంకు సాధించాలనే ఎంతో కఠినమైన ప్రిపరేషన్‌ అవసరం. అందుకే యేటా ఎన్నో లక్షల మంది విద్యార్ధులు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ ఉంటారు. జేఈఈ మెయిన్‌లో మెరుగైనా ర్యాంకు సాధించిన వారికి.. ప్రతిష్టాత్మక NIT, IIITలలో బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో సీట్లు లభిస్తాయి. జేఈఈ మెయిన్‌లో తొలి 2.5 ర్యాంకర్లకు జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హత ఉంటుంది. ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగా IIT వంటి సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.