JEE Main July 2022: జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. పరీక్ష తేదీలివే..

|

Jun 02, 2022 | 3:21 PM

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ సెషన్‌ -2 (JEE 2022 Main Session 2) రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ బుధవారం (జూన్ 1) నుంచి ప్రారంభమవుతున్నట్లు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటించింది..

JEE Main July 2022: జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. పరీక్ష తేదీలివే..
Jee Main 2022 July
Follow us on

JEE Main 2022 July session registration last date: జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ సెషన్‌ -2 (JEE 2022 Main Session 2) రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ బుధవారం (జూన్ 1) నుంచి ప్రారంభమవుతున్నట్లు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 30 రాత్రి 11 గంటల 50 నిముషాల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. జులై 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్ష జరగనుంది.

కాగా జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2కు కూడా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే..అటువంటి వారు లాగిన్‌ అయ్యేటప్పుడు గతంలో కేటాయించిన అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ వివరాలను నమోదుచేయడం ద్వారా లాగిన్‌ అవ్వవచ్చు. అప్లికేషన్‌ ఫాంలో పేపర్‌ వివరాలు, పరీక్ష మీడియం, పరీక్ష కేంద్రం, ఎగ్జామినేషన్‌ ఫీజు చెల్లింపులు.. మాత్రమే నమోదు చేస్తే సరిపోతుంది. కొత్తగా మళ్లి దరఖాస్తు చేసుకోవల్సిన అవసరం లేదు.

జేఈఈ మెయిన్‌- 2022 జులై సెషన్‌ ముఖ్యమైన తేదీలు ఇవే..

ఇవి కూడా చదవండి
  • జేఈఈ మెయిన్‌- 2022 సెషన్‌ 2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: జూన్‌ 1, 2022.
  • దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 30, 2022 రాత్రి 9 గంటల వరకు.
  • దరఖాస్తు రుసుము చెల్లింపులకు చివరి తేదీ: జూన్‌ 30, 2022 రాత్రి 11 గంటల 50 నిముషాల వరకు.
  • జేఈఈ మెయిన్‌- 2022 సెషన్‌ 2 పరీక్ష తేదీలు: జులై 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30
  • జేఈఈ మెయిన్‌- 2022 సెషన్‌ 1 అడ్మిట్‌ కార్డుల విడుదల: జూన్‌ మధ్యలో, 2022.
  • జేఈఈ మెయిన్‌- 2022 సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డుల విడుదల: జులై మధ్యలో, 2022.
  • జేఈఈ మెయిన్‌ ఫలితాల విడుదల తేదీ: ఆగస్టు 6, 2022.

జేఈఈ మెయిన్ జులై 2022 పూర్తి షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.