JEE Main 2026 Corrections Dates: జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో తప్పులు దొర్లాయా..? ఐతే ఇలా సరి చేసుకోండి..
JEE (Main) 2026 Session1 Correction Window dates: జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్ పరీక్షకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు.. తమ అప్లికేషన్‌లో ఏవైనా తప్పులు చేస్తే వాటిని సవరించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్టీయే ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన మేరకు..

హైదరాబాద్, నవంబర్ 23: జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మరో 3 రోజుల్లోనే ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు నవంబర్ 27వ తేదీ ముగింపు సమయంలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అయితే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు.. తమ అప్లికేషన్‌లో ఏవైనా తప్పులు చేస్తే వాటిని సవరించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్టీయే ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన మేరకు ఈ డిసెంబర్ 1 నుంచి 2వ తేదీ రాత్రి 11.50 వరకు జేఈఈ మెయిన్ అప్లికేషన్‌లో పొరబాట్లను సవరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుల్లో ఎటువంటి మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీయే సూచించింది.
జేఈఈ మెయిన్ సెషన్ 1 దరఖాస్తు సవరణకు ఇక్కడ క్లిక్ చేయండి.
జేఈఈ మెయిన్ సెషన్ 1 దరఖాస్తు సమయంలో వివరాలు తప్పుగా నమోదుచేసిన అభ్యర్థులకు ఒక్కసారి మాత్రమే వివరాలు సవరించుకునేందుకు అవకాశం ఇస్తారు. ముఖ్యంగా ఆన్‌లైన్ దరఖాస్తులో అభ్యర్థి మొబైల్ నంబర్, ఈ-మెయిల్, అడ్రస్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ వివరాలు, అభ్యర్థి ఫొటోను మార్చడానికి అవకాశం ఉండదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అభ్యర్థి పేరు, తండ్రి పేరు,తల్లి పేర్లలో ఏదో ఒకటి మాత్రమే సవరించేందుకు అవకాశం ఇస్తారు. పదో తరగతి, 12వ తరగతి సంబంధిత వివరాలు, పాన్ కార్డు నంబర్, పరీక్ష రాయాలనుకొనే నగరం, మాధ్యమాన్ని మార్చుకొనేందుకు ఛాన్స్ ఉంటుంది.
అలాగే అభ్యర్థి పుట్టిన తేదీ, జెండర్, కేటగిరీ, సబ్ కేటగిరీ/పీడబ్ల్యూడీ, సంతకం మార్చుకోవచ్చు. ఆధార్ కాకుండా ఇతర గుర్తింపుతో నమోదు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే తమ గుర్తింపు వివరాలను మార్చడానికి అనుమతి ఉంటుంది. ఆధార్ వివరాలు సవరించుకోవడానికి మాత్రం అవకాశం ఉండదు. ఈ విషయాలను అభ్యర్ధులు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా సవరించుకోవల్సి ఉంటుంది. కాగా జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ఆన్‌లైన్ రాత పరీక్షలు జనవరి 21 నుంచి 30 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్న సంగతి తెలిసిందే.
ఇతర వివరాలుకు ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








