విద్యార్ధులకు అలర్ట్! వచ్చే వారంలోనే JEE Main 2023 నోటిఫికేషన్‌ ..

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ మెయిన్‌ 2023) నోటిఫికేషన్‌ వచ్చేవారం విడుదల చేయనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు బుధవారం (నవంబర్ 23) తెలిపారు. జేఈఈ నోటిఫికేషన్‌..

విద్యార్ధులకు అలర్ట్! వచ్చే వారంలోనే JEE Main 2023 నోటిఫికేషన్‌ ..
JEE Main 2023 Notification Likely Next Week

Updated on: Nov 23, 2022 | 6:06 PM

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ మెయిన్‌ 2023) నోటిఫికేషన్‌ వచ్చేవారం విడుదల చేయనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు బుధవారం (నవంబర్ 23) తెలిపారు. జేఈఈ నోటిఫికేషన్‌ ఈ వారం విడుదల చేయడం లేదని, వచ్చేవారం నవంబర్‌ 30 వతేదీలోపు ప్రకటన వెలువడుతుందని అన్నారు. జేఈఈ మెయిన్‌ 2023 రెండు దఫాల్లో జరగనున్నట్లు ఇప్పటికే ఎన్టీఏ స్పష్టం చేసింది కూడా. వచ్చే ఏడాది తొలి విడత జనవరిలో, మలి విడత ఏప్రిల్‌ నెలలో నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా దేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఈఎస్టీ, ఐఐఐటీ ఇతర సంస్థల్లో బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతీ యేట జేఈఈ మెయిన్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు. జేఈఈ పరీక్షకు సంబంధించి ఇటీవల ఓ ఫేక్‌ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అప్‌డేట్స్‌ కోసం అభ్యర్ధులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) పూర్తి చేసిన విద్యార్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఐతే జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్ష జనవరి జరిగితే తమ అకడమిక్‌ పరీక్షలకు ఇబ్బంది కలుగుతుందని, రివిజన్‌కు సమయం కుదరదని విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఎన్‌టీఏ అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. తొలి విడత జేఈఈ మెయిన్‌ 2023 పరీక్షను జనవరిలోకాకుండా ఏప్రిల్‌లో నిర్వహించాలని విద్యార్ధులు కోరుతున్నారు. 12వ తరగతి సిలబస్ కూడా ఇంకా పూర్తి కాలేదని, బోర్డు పరీక్షల ప్రాక్టికల్స్‌ కూడా జనవరిలోనే ప్రారంభిస్తున్నాయి. ఈ కారణాల దృష్ట్యా పరీక్షల తేదీలపై సరైన నిర్ణయం తీసుకోవల్సిందిగా అభ్యర్ధిస్తున్నారు. గతేడాది మొదటి సెషన్‌ జూన్‌ 20- 29 తేదీల మధ్య జరగ్గా.. రెండో సెషన్‌ పరీక్షను జులై 21- 30 తేదీల మధ్య నిర్వహించారు. ఈ రెండు విడతలకు దాదాపు 9,05,590 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.