JEE Main 2022 Session 1 Admit Card download: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Mains) మెయిన్ 2022 సెషన్ 1 పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకూ దేశవ్యాప్తంగా 501 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ జూన్ 14న (మంగళవారం) తెలియజేసింది. జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు త్వరలో విడుదలకానున్నాయి. అంతకంటే ముందు ఎవరెవరికి ఏయే సిటీల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారనే విషయాన్ని తెలుపుతూ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో ఇంటిమేషన్ స్లిప్ (JEE Main 2022 Intimation Slip)ను ఎన్టీఏ విడుదల చేసింది.
ఐతే దీనిలో పరీక్ష రాయవల్సిన సిటీ పేరు మాత్రమే ఉంటుంది. పరీక్ష కేంద్రం ఎక్కడ అనేది అడ్మిట్ కార్డుల్లో తెల్పుతామని, అభ్యర్ధులు ఈ తేడాను గమనించవల్సిందిగా సూచించింది. ఒక వేళ వెబ్‌సైట్ నుంచి స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే 01140759000 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయవల్సిందిగా పేర్కొంది. పరీక్షకు మరో వారం రోజులే గడువు ఉండటంతో అడ్మిట్ కార్డు ఇంకా జారీచేయకుండా కేవలం ఇంటిమేషన్ స్లిప్ మాత్రమే విడుదల చేయడంతో విద్యార్థుల ఆందోళన చెందుతున్నారు. కనీసం పది రోజుల ముందునుంచైనా అడ్మిట్ కార్డులు జారీ చేయకుండా చివరి వరకు కాలయాపన చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.