Results: రేపే JEE అడ్వాన్స్ డ్ ఫలితాలు.. చెక్ చేసుకోండిలా..

జాతీయ స్థాయిలో ఇంజినీరింగ్ కళాశాలలు, IITల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ Jee అడ్వాన్స్‌డ్ ఫలితాలు సెప్టెంబర్ 11వ తేదీ ఆదివారం వెల్లడికానున్నాయి. Jeeadv.ac.in లేదా ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా అధికారిక..

Results: రేపే JEE అడ్వాన్స్ డ్ ఫలితాలు.. చెక్ చేసుకోండిలా..
Jee Main Results 2022
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 10, 2022 | 9:41 PM

Results: జాతీయ స్థాయిలో ఇంజినీరింగ్ కళాశాలలు, IITల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ Jee అడ్వాన్స్‌డ్ ఫలితాలు సెప్టెంబర్ 11వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు వెల్లడికానున్నాయి. Jeeadv.ac.in లేదా ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి.. అభ్యర్థులు తమ ఫలితాలు, మార్కులు, ర్యాంక్‌లను చెక్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలతో పాటు త్వరలో ఫైనల్ ఆన్సర్ కీ కూడా విడుదల చేయనున్నారు. ఫలితం తర్వాత, సీట్ల కేటాయింపు (Joint Seat Allocation Authority) కౌన్సెలింగ్ 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులకు వారి మెరిట్, ప్రాధాన్యత సీట్ల లభ్యతను బట్టి సీట్లు కేటాయిస్తారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 1,60,038 మంది మాత్రమే నమోదు చేసుకోగా, అందులో 1,56,089 మంది మాత్రమే ఈ పరీక్షకు హాజరయ్యారు. ఐఐటీ బాంబే జేఈఈ అడ్వాన్స్‌డ్ పేపర్ 1, పేపర్ 2లకు సంబంధించిన పరీక్షను ఆగస్టు 28వ తేదీన నిర్వహించింది. దేశవ్యాప్తంగా 577 నగరాల్లోని 124 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. తాత్కాలిక ఆన్సర్ కీ ద్వారా వచ్చిన అభ్యర్థనల కారణంగా కొన్ని ప్రశ్నలు తొలగించారు. ఫిజిక్స్ పేపర్ 1, పేపర్ 2 రెండింటిలోనూ ఒక్కో ప్రశ్న తీసివేశారు. వీటికి సమాధానం ఇచ్చిన వారందరికీ పూర్తి మార్కులు వేస్తారు.

ఫిజిక్స్ పేపర్ 1లోని సెక్షన్ 3లో 15వ నెంబర్ ప్రశ్నకు ఏ సమాధానం రాసిన మార్కులు ఇవ్వనున్నారు. అలాగే ఫిజిక్స్ పేపర్ 2 సెక్షన్ 3లో 17వ నెంబర్ ప్రశ్నకు ఏ సమాధానం ఇచ్చినా మార్కులు ఇవ్వనున్నారు. Jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌ ని సందర్శించి హోమ్ పేజిలో ఉన్న Jee అడ్వాన్స్‌డ్ 2022 ఫలితం లింక్ ని క్లిక్ చేయాలి. ఆతర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. ఆతర్వాత Jee అడ్వాన్స్‌డ్ 2022 ఫలితం స్ర్కిన్ కనిపిస్తోంది.

దేశంలోని 23 జాతీయ స్థాయి సంస్థల్లో మొత్తం 16,598 సీట్లలో ప్రవేశం కల్పించనున్నారు. ఇందులో 1567 సీట్లు మహిళల కోసం కేటాయించినవి. ఐఐటీలలో సీట్లు గతేడాది కంటే 366 పెరిగాయి. గతేడాది మహిళలకు 1,534 సీట్లు రిజర్వ్ చేయగా.. ఈఏడాది 33 సీట్లు అదనంగా రిజర్వ్ చేశారు. ఐఐటీ బాంబేలో ఈ ఏడాది 1,360 సీట్లు ఉండగా, ఐఐటీ ఢిల్లీలో 1,209 సీట్లు ఉన్నాయి. ఐఐటీ మద్రాస్‌లో 1,133, ఖరగ్‌పూర్‌లో 1869, రూర్కీలో 1,353 సీట్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.