Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలు.. మొదలైన దరఖాస్తుల స్వీకరణ.. పూర్తి వివరాలివే..
వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక సైట్ Rrc-wr.com ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. వెస్ట్రన్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో వివిధ..
Railway Jobs: వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక సైట్ Rrc-wr.com ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. వెస్ట్రన్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక సైట్ Rrc-wr.com ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబరు 5 వ తేదీన ప్రారంభమైంది. ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు అక్టోబర్ 4వ తేదీతో ముగుస్తుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా సంస్థలోని 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. లెవల్ 4, 5 ఉద్యోగాలు 5 ఖాళీలుండగా,, లెవల్ 2,3 లో 16 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. లెవల్ 4, 5 ఉద్యోగాల కోసం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. లెవల్ 2, 3 ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. విద్యార్హత తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుండి పొంది ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 2023 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ. 500 కాగా, Sc / St / మాజీ సైనికులు / మహిళలు, మైనారిటీలు / Ebc అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ. 250. ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలి.
ఎంపిక విధానం: రైల్వే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ట్రయల్స్ & స్పోర్ట్ ఫర్మామెన్స్ , విద్యా అర్హతలతో సహా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల ఎంపికలో ట్రయల్ కమిటీ క్రీడా సామర్థత, భారతీయ రైల్వే జట్టులో ఆడడం వంటి అంశాలను పరిశీలిస్తుంది. ట్రయల్స్ ఆధారంగా అభ్యర్థులు ఫిట్ లేదా అన్ ఫిట్ గా నిర్ణయిస్తారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.