JEE Advanced Result: విద్యార్థులకు అలెర్ట్.. నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు.. ఇలా సులువుగా చెక్ చేసుకోండి..

JEE advanced result 2021: దేశంలోని ఐఐటీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. వెంటనే రేపటి నుంచి అడ్మిషన్ల కోసం

JEE Advanced Result: విద్యార్థులకు అలెర్ట్.. నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు.. ఇలా సులువుగా చెక్ చేసుకోండి..
Jee
Follow us

|

Updated on: Oct 15, 2021 | 9:04 AM

JEE advanced result 2021: దేశంలోని ఐఐటీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. వెంటనే రేపటి నుంచి అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. దేశంలోని 23 ఐఐటీలు, 32 ఎన్‌ఐటీలు, 26 ట్రిపు ల్‌ ఐటీల్లోని సీట్ల భర్తీ కోసం ఈ కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. ఫలితాల అనంతరం రేపటి నుంచి (అక్టోబర్ 16) అడ్మీషన్ల కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 22, 24 తేదీల్లో జోసా మాక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. దీనికోసం విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 25 వరకు ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. 27న మొదటి దశ సీట్లను కేటాయించనున్నారు. నవంబరు 1న రెండో దశ సీట్ల కేటాయింపు, నవంబరు 6న మూడో దశ, 10న నాల్గవ విడత, 12న నాల్గవ విడత, 14న ఐదవ విడత, 18న ఆరో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జరగనుంది. మొత్తం ఆరుదశల్లో నవంబరు 18వ తేదీ వరకు సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగనుండగా.. చివరి దశలో సీటు పొందిన విద్యార్థులు నవంబర్‌ 20 నాటికి రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

కాగా.. జేఈఈ మెయిన్స్‌ ర్యాంకులు గత నెల 15వ తేదీన ప్రకటించారు. ఇందులో అర్హత సాధించిన వారు అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాశారు. ఈ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఈ నెల 3వ తేదీన నిర్వహించిన విషయం తెలిసిందే. ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఈ పరీక్షను నిర్వహించింది. జాతీయ స్థాయిలో 23 ఐఐటీలు, 32 జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీలు (ఎన్‌ఐటీలు), 26 ట్రిపుల్‌ ఐటీ కాలేజీలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో నడిచే మరో 33 విద్యా సంస్థల్లో దాదాపు 50 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

పరీక్ష రాసిన అభ్యర్థులు http://jeeadv.ac.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్, వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయాలి. అనంతరం జేఈఈ అడ్వాన్సడ్ ఫలితం కనిపిస్తుంది. మెరిట్ లిస్ట్, ర్యాంక్ లిస్ట్, స్కోర్ కార్డ్‌ ఫలితాలన్నింటిని ఒకే చోట తెలుసుకోవచ్చు.

Also Read:

Work From Home Ends: ఇంటి దగ్గర నుంచి ఉద్యోగం చేసింది చాలు.. త్వరలో ఆఫీసులకు రండి అంటున్న దేశీయ దిగ్గజ టెక్ సంస్థ

Fee Reimbursement: సర్టిఫికెట్లు కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు.. కళాశాలలకు ఉన్నత విద్యా మండలి వార్నింగ్