JEE Advanced 2024 Answer Key: కఠినంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. ఆన్సర్‌ కీ విడుదల ఎప్పుడంటే!

దేశవ్యాప్తంగా ఆదివారం (మే 26) జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం రెండు పేపర్లకు గానూ ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరిగాయి. గతేడాది జరిగిన పరీక్షతో పోలిస్తే ఈ సారి కూడా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ మధ్యస్తం నుంచి కఠినంగా ఉన్నట్లు విద్యార్ధులు చెబుతున్నారు. పేపర్‌ 1 కంటే పేపర్‌ 2 మరికొంత కఠినంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు..

JEE Advanced 2024 Answer Key: కఠినంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. ఆన్సర్‌ కీ విడుదల ఎప్పుడంటే!
JEE Advanced
Follow us
Srilakshmi C

|

Updated on: May 27, 2024 | 3:08 PM

హైదరాబాద్‌, మే 27: దేశవ్యాప్తంగా ఆదివారం (మే 26) జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం రెండు పేపర్లకు గానూ ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరిగాయి. గతేడాది జరిగిన పరీక్షతో పోలిస్తే ఈ సారి కూడా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ మధ్యస్తం నుంచి కఠినంగా ఉన్నట్లు విద్యార్ధులు చెబుతున్నారు. పేపర్‌ 1 కంటే పేపర్‌ 2 మరికొంత కఠినంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఫిజిక్స్‌ పేపర్‌లోని ప్రశ్నలు కఠినంగా ఉన్నట్లు చెబుతున్నారు. పేపర్‌-1, 2 కలిపి మొత్తం 360 మార్కులకు ఈ పరీక్ష జరిగింది. ఒక్కో పేపర్‌లో మూడు సబ్జెక్టులకు నాలుగు సెక్షన్లలో మొత్తం 51 ప్రశ్నలు చొప్పున ఇచ్చారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 17 ప్రశ్నలు వచ్చాయి.

పేపర్‌-1లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో కాస్త ఎక్కువ సమయం తీసుకునేవిగా ఉన్నాయి. కెమిస్ట్రీ ప్రశ్నలు అన్నిటి కంటే కఠినంగా ఉన్నాయి. దీంతో ర్యాంక్‌ కొట్టడంలో కెమిస్ట్రీ కీలకంగా మారనుంది. ఇక మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు మధ్యస్థం నుంచి కఠినంగా ఉండే ప్రశ్నలు వచ్చాయి. ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో ప్రశ్నలు కాస్త సులువుగా ఉన్నప్పటికీ.. ఫిజికల్‌ కెమిస్ట్రీలో మాత్రం క్యాలిక్యులేషన్‌తో కూడిన సుధీర్ఘమైన ప్రశ్నలు వచ్చాయి. మొత్తంమీద ఈ సారీకూడా కటాఫ్‌ గతేడాది మాదిరిగానే ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గతేడాది జనరల్‌ విభాగంలో కటాఫ్‌ మార్కుల 360కు 86గా ఇచ్చారు. ఈసారి పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కటాఫ్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈసారి దేశవ్యాప్తంగా ఎంత మంది పరీక్ష రాశారన్న విషయం ఐఐటీ మద్రాస్‌ వెల్లడించలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది రాసి ఉంటారని అంచనా. కాగా క్వశ్చన్‌ పేపర్‌లో ఎన్ని మార్కులకు ప్రశ్నలు ఉంటాయి, ఎన్ని సెక్షన్లు ఉంటాయి వంటి వివరాలు ముందుగానే విద్యార్ధులకు తెలియజేయలేదు. నిజానికి, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రత్యేకత ఇదేనట. అయితే గత మూడేళ్లుగా రెండు పేపర్లకు కలిపి మొత్తం 360 మార్కులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. దీన్ని ఐఐటీలు నిర్ణయించి ఉంటాయని భావిస్తున్నారు. కాగా జూన్‌ 2న ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ విడుదల కానుంది. జూన్‌ 9న ఫలితాలు ప్రకటించి, ర్యాంకులు వెల్లడిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!