School Reopen: విద్యా రంగంగపై కరోనా (Corona) మహమ్మారి ప్రభావం ఎంతలా పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు అకడమిక్ ఇయర్స్ ఈ వైరస్ దాడికి కోలుకోలేకపోయింది. ఎంతో మంది చిన్నారులు విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వచ్చింది. చాలా రాష్ట్రాల్లో బోర్డులు విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించారు. ఇక సెకండ్ వేవ్ తర్వాత చిన్నారులు మళ్లీ బడి బాట పడుతున్నారని అనుకుంటున్న సమయంలోనే థార్డ్ వేవ్ (Corona Third Wave) రూపంలో మరోసారి కరోనా విజృంభించింది. దీంతో పాఠశాలలు మళ్లీ మూతపడే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూసివేశారు. దీంతో ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పెరిగింది. చిన్నారులకు సైతం వ్యాక్సిన్ అందిస్తున్నారు. ముఖ్యంగా 15 ఏళ్ల వయసు గ్రూప్ వారికి కూడా వ్యాక్సిన్ అందుతుండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా దేశంలో విద్యా సంస్థల పునఃప్రారంభం విషయంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
కరోనా కేసులు రోజురోజుకీ తగ్గుముఖం పడుతుండడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం పెరుగుతుండడంతో కేంద్రం విద్యా సంస్థల ప్రారంభం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నిపుణుల కమిటీ ఇచ్చే సూచన మేరకు విద్యా సంస్థల పునఃప్రారంభ ప్రక్రియను చేపట్టనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే దేశంలో గురువారం నాటికి 164.35 కోట్ల డోసుల వ్యాక్సిన్ జరిగిన విషయం తెలిసిందే.
Also Read: SSC JE Result 2019: SSC జూనియర్ ఇంజనీర్ ఫలితాలు విడుదల.. ఇలా తనిఖీ చేసుకోండి..?
NMMSS 2022: ఏడో తరగతి విద్యార్థులకు ఏటా రూ.12000.. చివరి తేదీ జనవరి 30..?
Bride and groom funny video: వధువు పనికి వరుడి ఫ్యూజులు ఔట్..! వైరల్ అవుతున్న ఫన్నీ పెళ్ళి వీడియో..