Bride and groom funny video: వధువు పనికి వరుడి ఫ్యూజులు ఔట్..! వైరల్ అవుతున్న ఫన్నీ పెళ్ళి వీడియో..
పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. చాలా మంది తమ పెళ్లి ఎలా జరగాలి.. ఎలాంటి అమ్మాయి భార్యగా రావాలి అని విషయాలలో ఎన్నో కలలు కంటారు. మేళా తలాలు.. బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరుపుకుంటుంటారు.
పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. చాలా మంది తమ పెళ్లి ఎలా జరగాలి.. ఎలాంటి అమ్మాయి భార్యగా రావాలి అని విషయాలలో ఎన్నో కలలు కంటారు. మేళా తలాలు.. బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరుపుకుంటుంటారు. ఇక పెళ్లి తంతులో వధువు.. వరుడులతో బంధుమిత్రులు చేసే అల్లరి చూస్తూనే ఉంటాం. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నా.. మరికొన్ని నవ్వులు పూయిస్తుంటాయి.
కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో వధువు చేసిన పనికి వరుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నవ్వులు పూయిస్తుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో.. వరుడు పెళ్లికూతురిని స్వీట్లు తినమని కోరాడు. ఆమె ఒప్పుకోలేదు. దీంతో మళ్లీ మళ్లీ స్వీట్స్ తినాలని కోరాడు.. వధువు ఏం చెప్పినా సరే పట్టించుకోకుండా.. స్వీట్స్ తినమని బలవంతపెట్టాడు. దీంతో చిరాకొచ్చిన వధువు అతని కాలిని గట్టిగా గిల్లింది. దీంతో వరుడి భాధ మొత్తం వీడియోలో రికార్డ్ అయ్యింది.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

