Work From Home: ఆఫీసులకు వేళాయే.. ఇక చాలు వచ్చేయండి అంటోన్న కంపెనీలు..

|

Feb 13, 2022 | 7:10 AM

Work From Home: ఎక్కడో చైనాలోని ఊహాన్‌ పట్టణంలో వెలుగులోకి వచ్చిన కరోనా (Corona) మహమ్మారి యావత్‌ దేశాన్ని గడగడలాడించింది. కంటికి కనిపించని ఓ చిన్న వైరస్‌కు ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోయింది...

Work From Home: ఆఫీసులకు వేళాయే.. ఇక చాలు వచ్చేయండి అంటోన్న కంపెనీలు..
It Companies
Follow us on

Work From Home: ఎక్కడో చైనాలోని ఊహాన్‌ పట్టణంలో వెలుగులోకి వచ్చిన కరోనా (Corona) మహమ్మారి యావత్‌ దేశాన్ని గడగడలాడించింది. కంటికి కనిపించని ఓ చిన్న వైరస్‌కు ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోయింది. కరోనా పుణ్యామాని అప్పటి వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని అవలంభించని కంపెనీలు సైతం అమలు చేయాల్సి వచ్చింది. దీంతో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటును కల్పించాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు కంప్లీట్‌గా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని తీసుకొచ్చాయి. గడిచిన రెండేళ్లుగా ఐటీ కంపెనీలన్నీ మూతపడ్డాయి.

అయితే తాజాగా పరిస్థితులు మారాయి. కరోనా థార్డ్‌ వేవ్‌ అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపకపోవడం, కేసులు క్రమంగా తగ్గిపోవడంతో మళ్లీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసుకు పిలిచాయి కూడా. ఇక తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రావు కూడా ఇక కరోనా ముగిసిందని, ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలవాలని తెలిపిన విషయం తెలిసిందే. దీనికి కారణంగా ఐటీ కంపెనీలు మూత పడడంతో ఐటీ రంగంపై ఆధారపడిన ఇతర వర్గాలపై తీవ్ర ప్రభావమే. ఉద్యోగులు మళ్లీ ఆఫీసులబాట పడితే ఎంతో మందికి ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే కంపెనీలు సైతం ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ లో పలు ఐటీ సంస్థలు  ఏప్రిల్‌ 1 నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే ఆలోచనలో ఉన్నాయి. ఇందులో భాగంగానే తమ ఉద్యోగులను ఇప్పటి నుంచే సంసిద్ధం చేస్తున్నాయి. నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లిన తమ ఉద్యోగులను తిరిగి రమ్మని కబురు పెడుతున్నాయి. అయితే అందరినీ ఒకేసారి కాకుండా ప్రారంభంలో రొటేషనల్‌ విధానంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీసు విధానాన్ని అవలంభించే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయి.

Also Read: Chanakya Niti: సంపద శ్రేయస్సు కోసం మనిషి ఈ నాలుగు విషయాలను గుర్తు పెట్టుకోవాలంటున్న చాణక్య..

Women Workers: ఆ కంపెనీల్లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు..

Yadadri Temple: ఏడేండ్ల కష్టానికి ఫలితం.. మరికొన్ని రోజుల్లో పునః ప్రారంభం కానున్న యాదాద్రి ఆలయం