ISRO Recruitment: ఇస్రోలో 160 అప్రెంటీస్‌ పోస్టులు.. ఫస్ట్‌ క్లాస్‌ మార్కులతో పాసైన వారు అర్హులు.

|

Jul 12, 2021 | 11:11 AM

ISRO Recruitment 2021: ఇండియన్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు చెందిన లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ సెంటర్‌ (ఎల్‌పీఎస్‌సీ) పలు విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. తిరువనంతపురంలోని...

ISRO Recruitment: ఇస్రోలో 160 అప్రెంటీస్‌ పోస్టులు.. ఫస్ట్‌ క్లాస్‌ మార్కులతో పాసైన వారు అర్హులు.
Isro Recruitment
Follow us on

ISRO Recruitment 2021: ఇండియన్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు చెందిన లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ సెంటర్‌ (ఎల్‌పీఎస్‌సీ) పలు విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. తిరువనంతపురంలోని వాలియమాలలో ఉన్న సంస్థలో మొత్తం 160 అప్రెంటీస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అర్హులెవరు లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 160 ఖాళీలకుగాను గ్యాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (73), టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌ – 87 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* మెకానికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్, కంప్యూటర్‌ సైన్స్, సివిల్‌ ఇంజనీరింగ్, లైబ్రరీ సైన్స్‌ విభాగాల్లో గ్యాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులను తీసుకోనున్నారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 65 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో ఫస్ట్‌ క్లాస్‌ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
* మెకానికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, కెమికల్, కంప్యూటర్‌ సైన్స్,సివిల్‌ ఇంజనీరింగ్, లైబ్రరీ సైన్స్, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో భర్తీ చేయనున్న టెక్నీషియన్‌ (డిప్లొమా) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు ఎంపికైన వారికి స్టైపండ్‌గా నెలకు రూ. 9000 అందిస్తారు.
* టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌ పోస్టులకు ఎంపికైన వారికి స్టైపండ్‌గా నెలకు రూ. 8000 అందిస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు కేరళలోని తిరువనంతపురం, వాలియమాలాలో శిక్షణ ఇస్తారు.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ 30-06-2021న మొదలుకాగా 26.07.2021 తేదీన ముగియనుంది.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Kongu Nadu: దేశంలో మరోసారి తెరపైకి రాష్ట్ర విభజన అంశం.. తమిళనాట రాజకీయ రచ్చ

ఆమ్మో పోలీసోళ్లు ! 40 రోజుల్లో 20 కాల్పుల ఘటనలు..అస్సాంలో ‘పోటెత్తిన’ ఫేక్ ఎన్ కౌంటర్లు ?

Rajinikanth Returns: తలైవా మళ్లీ వస్తున్నాడు.. రీ ఏంట్రీపై తేల్చేస్తానంటున్న సూపర్ స్టార్