ISRO JRF Recruitment 2022: భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) పరిధిలోని డెహ్రాడూన్‌లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (IIRS).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల (JRF Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు-16, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు-3, రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు-1
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు 31,000ల నుంచి 56,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంఈ/ఎంటెక్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నెట్/గేట్/ఐఐఆర్‌ఎస్-జెట్/తత్సమాన అర్హత ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.
అడ్రస్: The Director, S.V.Gosamrakshana Trust, TTD., Chandragiri Road, Tirupati – 517 502.
ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 18 నుంచి 22 వరకు, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: