BEL Recruitment 2022: ఏడాదికి రూ.17లక్షల జీతంతో.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 33 ఉద్యోగాలు.. అర్హతలేవంటే..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఇంజనీర్ (Senior Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
BEL Senior Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఇంజనీర్ (Senior Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 33
పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఇంజనీర్ పోస్టులు
- డిప్యూటీ మేనేజర్ పోస్టులు: 6
విభాగాలు: కంట్రోల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్.
వయోపరిమితి: ఫిబ్రవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 36 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: ఏడాకి రూ.17,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
- సీనియర్ ఇంజనీర్ పోస్టులు: 37
విభాగాలు: కంట్రోల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఆప్టిక్స్.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: ఏడాకి రూ.14,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: Manager (HR), Product Development & Innovation Centre (PDIC), Bharat Electronics Limited, Prof. U R Rao Road, Near Nagaland Circle, Jalahalli Post, Bengaluru – 560 013, India.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: