AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISP Recruitment: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం… భారీగా జీతం పొందే అవకాశం.. పూర్తి వివరాలు..

ISP Recruitment 2022: సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నాసిక్‌రోడ్‌లో ఉన్న ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌...

ISP Recruitment: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... భారీగా జీతం పొందే అవకాశం.. పూర్తి వివరాలు..
Isp Jobs
Narender Vaitla
|

Updated on: Sep 13, 2022 | 10:07 AM

Share

ISP Recruitment 2022: సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నాసిక్‌రోడ్‌లో ఉన్న ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌ (ISP)లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ఆఫీసర్‌ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (01), జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ (15) ఖాళీలు ఉన్నాయి.

* వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు. అంతేకాకుండా సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

* జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అప్లై చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థు వయసు 28 ఏళ్లు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* వీటిలో వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 29,740 నుంచి రూ.103000 అందిస్తారు. జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎంపికన వారికి నెలకు రూ.21,540, రూ.77,160 వరకు చెల్లిస్తారు.

* అభ్యర్థులను ఆన్‌లైన్‌ పరీక్ష, టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తు చేసుకునే వారు రూ. 600 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 10-10-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!