ISI Recruitment 2021: ప్రైవేట్ సంస్థలలో ఎన్నిలక్షల జీతం తీసుకున్నా ప్రభుత్వ ఉద్యోగం అంటే క్రేజ్. ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో ఇంజనీర్, ఇంజనీర్ అసిస్టెంట్ మొదలైన 45 పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి, అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగానికి ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి 23 జూలై చివరి తేదీ. ఆఫీషియల్ వెబ్ సైట్ https://www.isical.ac.in/. లాగిన్ అయ్యి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు, ఈ వెబ్ సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
ఇంజనీర్ (ఎలక్ట్రికల్) A – 2
ఇంజనీరింగ్ అసిస్టెంట్ (సివిల్) A – 3
ఇంజనీరింగ్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) A – 3
ఎలక్ట్రీషియన్ A – 14
ఆపరేటర్-కం-మెకానిక్ (లిఫ్ట్) A – 8
డ్రైవర్ A -1
అసిస్టెంట్ (లైబ్రరీ)A – 6
అసిస్టెంట్ (లాబరేటరీ) A – 4
రేప్రొ-ఫోటో A -2,
అసిస్టెంట్ (ఫార్మ్) A -1.
కుక్ A -1
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు, ఇతరులు అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ. 400 లతో పాటు ప్రాసెసింగ్ ఫీజు గా రూ. 100 చెల్లించాల్సి ఉంది.
అప్లికేషన్ ఫీజు నుంచి SC/ST/PwBD/ExSM , మహిళలకు మినహాయింపు ఇచ్చారు. వీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించక్కర్లేదు. అయితే రూ. 100 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంది.
Also Read: దేవికగా బుల్లి తెరపై సందడి చేయనున్న వంటలక్క మోడ్రన్ లుక్ స్టైలిష్ గా అదిరిందిగా